ఎల్బీనగర్ నుండి హయత్ నగర్ వరకు మెట్రో రైలు
హైదరాబాద్ : మెట్రోరైలు ఫేజ్ 2 పనులను ప్రారంభించేందుకు మెట్రో సంస్థ శ్రీకారం చుట్టింది. ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకూ మెట్రో మార్గాన్ని విస్తరించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకూ మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకూ మాత్రమే మెట్రో అందుబాటులో ఉంది. అయితే ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకూ సుమారు 7 కిలోమీటర్ల మెట్రోను విస్తరించాలని నిర్ణయించింది. ఒక్కో కిలోమీటరుకు అటూ ఇటుగా ఒక్కో స్టేషన్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది. దీనివలన హయత్ నగర్, వనస్థలిపురం, నిత్యం వచ్చే ప్రజలకు ఈ మెట్రో రైల్ ద్వారా ఎంతో ఉపయోగ ఉంటుందని కొంతమంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.