కాపు సంఘం ట్రస్ట్ నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం
హైదరాబాద్: కర్మాన్ ఘాట్, దాతునగర్ లో మున్నూరుకాపు సంఘం స్థలంలో ఆదివారం ఉదయం భూమి పూజ జరిగింది. తదనంతరం జరిగిన నూతన ట్రస్టు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర మున్నూరుకాపు మహాసభ ఉపాధ్యక్షులు, నాయవాది, కొండూరు వినోద్ కుమార్, ట్రస్టు చైర్మన్, సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు.చైర్మన్, దయారశెట్టి ప్రకాష్ రావు, సభ్యులు, కాసారపు చంద్రకుమార్, మడిగేల భాస్కర్ రావు, చింతల మనోజ్ కుమార్, పుంజారి త్రినాథ్ కుమార్, చుక్క అశోక్ కుమార్, తిరుపతి విజయ రాఘవేందర్ రాజ్. త్వరలో మరికొందరి తో ప్రమాణస్వీకారం చేయడం జరుగుతుందని తెలిపారు.