కేశవరావు (కేకే) సంచలన వ్యాఖ్యలు
రాజ్య సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం ఢిల్లీలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కల్వకుంట్ల ఫ్యామిలీ పబ్లిసిటీ చేసేవారని షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకే తెలంగాణలో పాలన ప్రజాస్వామ్యబద్ధంగా ఉందన్నారు. ఇక, కాంగ్రెస్ నా సొంతిల్లు అని, నేను కాంగ్రెస్ మనిషినని అన్నారు. తిరిగి తన సొంతగూటికి చేరినందుకుగా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంపీల పోరాటంతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందని కేకే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్‌లో కీలక హోదాల్లో పనిచేసిన కేకేకు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పోస్టు ఇస్తుందని పొలిటికల్ సర్కిల్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ ఉత్కంఠకు సీఎం రేవంత్ రెడ్డి తెరదించారు. కేకేకు కేబినెట్ ర్యాంక్‌తో కూడిన ప్రభుత్వ సలహాదారు పదవి ఇవ్వాలనుకుంటున్నామని చెప్పడంతో కేకే పోస్టింగ్ ఎపిసోడ్‌కు ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడింది.