చెట్లను తొలగించమని ఉప ముఖ్యమంత్రి పవన్ ఆదేశంకళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ : ఏడాకుల చెట్టు(కోనోకార్పస్) ప్రజల ఆరోగ్యానికి మంచిది కాదంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడంతో వాటిని తొలగించే పనిలో పడ్డారు అధికారులు. దక్షిణ అమెరికాకు చెందిన కోనోకార్పస్ జాతి మొక్కల్ని సుందరీకరణ కోసం వాడుతున్నారు. వాటి వలన భూగర్భజలాలు తగ్గిపోతాయని, ప్రజల ఆరోగ్యాలకు కూడా ప్రమాదమని ఓ అధ్యయనంలో తేలింది. దీంతో ఉప ముఖ్యమంత్రి ఆదేశాలను అనుసరించి ఏపీలో వాటిని తొలగించే ప్రక్రియ ప్రారంభమైంది.