చైర్మన్ను సత్కరించిన మున్నూరు కాపు జర్నలిస్టులు
వరంగల్ జిల్లా :నర్సంపేట నియోజకవర్గం ఇటీవల నర్సంపేట్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఎన్నికైన మున్నూరు కాపు ముద్దు బిడ్డ స్నేహ శీలి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాలాయి శ్రీనివాస్ ను ఆదివారం నర్సంపేట పట్టణంలో మున్నూరు కాపు జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో దుస్సాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నర్సంపేట రైతు బిడ్డలకు, పుర జనులకు చేదోడుగా ఉంటూ ఎల్లవేళలా, వారికి సేవ చేయుటకై ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో శీలం రమేష్ (జనం సాక్షి )నర్సంపేట, గండ్రాతి రమేష్ (సాక్షి రిపోర్టర్) ఖానాపురం, నూకల వీరభద్రం (నమస్తే తెలంగాణ) ఖానాపురం రాగం నరేందర్ (న్యూస్ 1.) నర్సంపేట, గాండ్ల ప్రదీప్ (హెచ్ ఎం టీవీ )నర్సంపేట, ఉప్పా వెంకన్న (తెలంగాణా కేసరి) ఖానాపురం, దరిగల హరిబాబు (ఆంధ్రజ్యోతి) గంగారం తదితరులు పాల్గొన్నారు.