పుట్టగొడుగుల కాపు సంఘాలు
పుట్టగొడుగు సంఘాలకు అడ్డుకట్టు ఎప్పుడు.? ఇతరుల సొమ్ముల మీద ఆధారపడి అర్ధిక వ్యవస్థగా మారడం వంటి లక్షణాలు జాతి తిరోగమనానికి సంకేతం. స్వయం ప్రతిభతో కులస్తుల మనస్సును చూరగొనాలి కానీ…. అల్ఫబుద్ధితో తోటి కులస్తులనే మోసగించే విధానాన్ని మార్చుకోవాలి.అనంతకాలంలో ఆర్థికంగా ఎక్కువ సంపాధన ఒంటపట్టించుకొని మోసాలకు పాల్పడం సరైన మార్గం కాదు. తాను స్వయం ప్రతిభతో వెలుగొందుతూ.. తమ జాతి అభివృద్ధి కోసం జ్యోతి లాగా వెలుగు నింపాలి, ఈ సమాజంలోని ఇతర కులస్తులకు అదర్శంగా నిలవాలి. అప్పుడు జాతి గర్వించి, శోభ మరింత ద్విగుణీకృతమవుతుంది.తమ జీవన విధానం సన్మార్గంలో కొనసాగించాలి.లేదంటే దురశ దుఃఖానికి చేటవుతుంది.చక్కటి ప్రణాళికతో వ్యాపారం చేసే వారికి కుల పెద్దల సహాయ ,సహకారాలు అండదండలు ఎప్పుడూ వారికి లభిస్తాయి.అంతేకాని దురాశతో సంఘాలను నిర్మింపచేసుకొని త్వరగా ధనవంతులు కావాలనో ,ప్రముఖులుగా రాణించాలనో అలాంటి వారికి ఏనాటికైనా తేట తెల్లం తప్పదు. జాతి మోసాలకు పాల్పడే వారిని జాతి ఎన్నటికీ క్షమించదు.మున్నూరుకాపులు గొప్ప ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్న వారిని . తమ నికృష్ట చేష్టలతో మోసగించడం క్షేమించరాని నేరం .జాతిని ఉత్తేజపరిచే వారు సదా స్మరణీయులు,అటువంటి వారిని ప్రముఖులు, కుల సంఘం పెద్దలు, కూడ వారిని గౌరవప్రదమైన పెద్ద పీట తప్పకుండా ఉంటుంది.మోసగించే విధానాలకు పాల్పడే వారిని జాతి నాయకులు కట్టడి చేయాలి, సంఘంలో అందరి ముందు నిలదీయాలి, లేదంటే స్వజాతి “కంచె”లుగా మారే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. తెలంగాణలో ఉన్న మన మున్నూరు కాపులు త్వరగా మేలుకోండి,తప్పనిసరిగా ఈ ఆర్టికల్ చదవండి పది మందికి పంపండి.