మున్నూరుకాపు వసతి గృహం స్థలం కొనుగోలుకు విరాళం
నిర్మల్ జిల్లా : ప్రముఖ ప్రసిద్ధ పుణ్య క్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాత మందిరం అతి సమీపంలో మున్నూరుకాపు వసతి గృహం, నిత్యాన్నదాన సత్రం కొరకు స్థలం అందరు కలిసి కొనుగోలు చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఇట్టి కొనుగోలుకు విరాళాల సేకరణ ముధోల్ నియోజకవర్గ మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు రోళ్ళ రమేశ్ ముధోల్ నియోజకవర్గం లోని అన్ని మండలాల కుల పెద్దల ఆధ్వర్యంలో జరుగుచున్నది. దానిలోనే భాగంగా మహారాష్ట్ర నాందేడ్ జిల్లా కేంద్రంలో విరాళాము అందించిన దాతలు.
వెంకటేష్, మారోటిరావు, కురువాడి లత్కర్ ఫ్యామిలీ మెంబర్ సురేఖ వెంకట్ ,ఒక్క లక్ష ఒక వేయి రూపాయలను శనివారం రోజున సంఘ అధ్యక్షునికి అందించారు.
విరాళాలు అందిస్తున్న వారి విరాళాల సేకరణకు సహకరిస్తున్న వారిపై సరస్వతి మాత కృపా కటాక్షములు ఎల్లప్పుడు ఉండాలని ప్రార్తిస్తున్నాను.
ఇట్టి కార్యక్రమంలో రోళ్ళ రమేశ్ తో పాటు మహారాష్ట్ర రాజ్య మున్నూరు కాపు కుల పెద్దలు సురేష్ అంబులగేకర్ , జిల్లా కార్యవర్గ సభ్యులు కుల పెద్దలు డాక్టర్ రాంచందర్ ,జిల్లా కార్యవర్గ సభ్యులు యువ నాయకులు కొరిడే హన్మండ్లు తానూర్ మండల సంఘం అధ్యక్షులు గార్గోట్ పోశెట్టి పెద్దలు వెంకటి కళ్యాణ్ పాడ్ పాల్గొన్నారు.