మున్నూరు కాపు భవన నిర్మాణ పనులు పర్యవేక్షిస్తున్న సంఘ నాయకులు

0

హైదరాబాద్: కోకాపేటలో మున్నూరుకాపుల ఆత్మ గౌరవ భవనం కోసం…గత ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాల అత్యంత విలువైన స్థలంలో 4 రోజులుగా రోడ్డు కోసం చదును చేసే పనులు జరుగుతున్నాయి.ఇందులో భాగంగా డిసెంబర్ 17 బుధవారం పనులను పర్యవేక్షించిన మున్నూరుకాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ పుటం పురుషోత్తం పటేల్,అపెక్స్ కౌన్సిల్ సభ్యులు మీసాల చంద్రయ్య పటేల్,అపెక్స్ కౌన్సిల్ సభ్యులు రమేష్ హజారి పటేల్ సంఘం రాష్ట్ర నాయకులు కాశెట్టి కుమార్ పటేల్,సంపాదకులు మాలి కరుణాకర్ పటేల్, సీనియర్ జర్నలిస్టు గోపాల బాలరాజు పటేల్ తదితరులు, పనులను పర్యవేక్షించినారు. అదే స్థలంలో స్థానికంగా తాత్కాలికంగా నిర్మింపజేసిన షెడ్డులో కరెంటు ఏర్పాటు చేసి వెలుగులు విరజింపజేసినారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న మున్నూరు కాపులకు ఈ భవనం కులానికి తలమానికంగా నిలుస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ భవనం నిర్మాణంలో రాష్ట్రంలో ఉన్న మున్నూరు కాపులు ఆర్థికంగా సమకూర్చినతో పనులు త్వరగా పూర్తిచేసుకుని ప్రారంభోత్సవం చేసుకోగలమని నాయకులు తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *