రాష్ట్ర బడ్జెట్లో తెలంగాణ మహిళలకు మొండిచేయి

0

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టిన దానిలో తెలంగాణ మహిళా లోకంపై చిన్నచూపు చూసిందని ధ్వజమెత్తుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలను గాలికి వదిలి, రాష్ట్ర మహిళలకు అన్యాయం చేసారని బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డిఆరోపించారు. రాష్ట్ర మహిళ మోర్చా ఆధ్వర్యంలో తెలుగుతల్లి ఫ్లైఓవర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద  కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన అనంతరం ధర్నా చేపట్టారు.శిల్పారెడ్డి మాట్లాడుతూ మహిళలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఎప్పటినుండి ఇస్తారో చెప్పలేదు, ప్రతి మహిళకు మహాలక్ష్మి పథకం కింద ఇరుయ్యి ఐదు వందల రూపాయలను ఎప్పుడు ఇస్తారని చెప్పలేదు, విద్యార్థినులకు ఇస్తానన్న స్కూటీ ఊసే లేదు,అడ్రస్ లేని విద్యార్థినులకు ఐదు లక్షల భరోసా కార్డు, తెలుపలేదు.ఎన్నికల ముందు అరు గ్యారంటీల పేరుతో మహిళలకు హామీలు ఇచ్చిన సోనియా,ప్రియాంక గాంధీ లు సమాధానం చెప్తారా లేక ప్రభుత్వంలో ఉన్న మహిళా మంత్రులు సమాధానం చెప్తారని బీజేపీ మహిళ మోర్చ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్.శిల్పా రెడ్డి  కాంగ్రేస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బడ్జెట్ లో తెలంగాణ మహిళలకు తీరని అన్యాయం చేసారని.మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చని పక్షంలో బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతుంది అని ప్రభుత్వాన్ని ఆమె హెచ్చరిస్తుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *