తెలంగాణ:హైదరాబాదులో శనివారం కాపు ఐక్యవేదిక ఏర్పాటు చేసిన సమావేశంలో కొండ దేవయ్య *ఆంధ్ర కాపులను బీసీ జాబితాలో చేర్పించుటకు* కృషి చేస్తానని సభాముఖంగా హామీ ఇవ్వడం పట్ల తెలంగాణలో ఉన్న మున్నూరు కాపులు దేవయ్య పై ధ్వజమెత్తుతూ… దేవయ్య దిష్టిబొమ్మను దగ్ధం చేయుటకు సన్నహాలు జరుగుతున్నాయి. దేవయ్య రాష్ట్ర అధ్యక్షునిగా స్వయప్రకటితంగా,ఏర్పాటు చేసుకొని తన రాజకీయ లబ్ధితోపాటు, ఆర్థిక వనరుల సమకూర్చుకొనుటకు ఆంధ్ర కాపు సంఘాలతో సంబంధాలు పెట్టుకొని, ఇలాంటి ప్రకటనలు చేయడంలో ఎంతవరకు సబబు అని పలు సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. దేవయ్య ఏమాత్రం చదువు సంస్కారం లేని అజ్ఞానిగా ఉండి,మిడిమిడి జ్ఞానంతో మాట్లాడడం *చిన్నపిల్లల చేష్టలుగా అవుపిస్తున్నట్లు* తెలుస్తుంది. దశాబ్ద కాలంగా మున్నూరు కాపులు ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడిపోతున్నారని బీసీలొ ఎక్కువ సంఖ్య కలిగిన మున్నూరు కాపులు రాజ్యాధికారం సాధించుకోలేకపోవడం చాలా బాధాకరం అందుకు ఇటీవల మున్నూరు కాపు నాయకులు రాజకీయంగా ఎదిగి ముఖ్యమంత్రి అయ్యే దిశలో బీసీలను కలుపుకొని పోరాటం చేస్తున్న తరుణంలో దేవయ్య ఇలాంటి ప్రకటనలు చేయడం మున్నూరు కాపులు ఇంకా వెనుకబడిపోతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.దీనికోసం గ్రామ,మండల,జిల్లా,రాష్ట్ర స్థాయిలలో మున్నూరు కాపు సంఘం నాయకులు దేవయ్య పై అగ్రహం వ్యక్తం చేస్తూ త్వరలో దిష్టిబొమ్మ దగ్ధం చేయుట కోసం సన్నాహాలు జరుగుతున్నయి అని తెలుస్తుంది-.మున్నూరుకాపు ఐక్యవేదిక.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *