జగిత్యాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శిలను సన్మానించిన మున్నూరుకాపులు

0

జగిత్యాల జిల్లా :కోరుట్ల పట్టణం లోని నూతనంగా ఎన్నికైన జగిత్యాల మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షులు వొడ్నాల రాజశేఖర్ ను, సంఘ ప్రధాన కార్యదర్శి చిట్ల రమణను కోరుట్ల మండల ముఖ్య నాయకులు ప్రజా ప్రతినిధులు శనివారం ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వొడ్నాల రాజశేఖర్ మాట్లాడుతూ కుల సంఘాలు ఐక్యంగా వుండి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను ఆదుకుంటామని విద్యా వైద్య పరంగా తగిన సహాయ సహకారాలు అందిస్తామని మున్నూరు కాపు సంఘం బలోపేతానికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలన్నారు,కుల అభ్యున్నతికి జిల్లా మున్నూరుకాపు సంఘం సహాయ సహకారాలు ఎల్లవేళలా వుంటాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్ల రమణ ,లైశెట్టి వెంకన్న,సీనియర్ న్యాయవాది రాచకొండ శ్రీరాములు,మార్గం నరేష్ కుమార్, నత్తి రాజ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం వేణు గోపాల్,పుప్పాల ప్రభాకర్, బండారి విజయ్,పడాల తిరుపతి,యతి రాజాం నర్సయ్య, బెల్లాల గంగాధర్,లైశెట్టి నర్సయ్య, గాండ్ల స్వామి,అత్తినేని గంగారెడ్డి,ఉప్పల నాగరాజు,బలిశెట్టి రాజేందర్,మార్గంప్రతాప్,మోహన్,రాజేష్,ప్రవీణ్,నవీన్,గంగారెడ్డి, నాగరాజు,వెంకటి, భగవంతు,సురేష్,భాస్కర్, రమేష్, సాయిరెడ్డి,మున్నూరుకాపు కుల బంధావులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *