17,న ఎల్బీనగర్ లో బీసీల సత్య గ్రహదీక్ష- చామకూరి రాజు
హైదరాబాద్: తెలంగాణలో అధిక శాతం ఉన్న బీసీ వర్గాలు ఒక త్రాటిపైకి వచ్చి 47% ఉన్న స్థానిక సంస్థ ఎన్నికలలో కుల జన గణన చేపట్టాలని ప్రభుత్వాన్ని పై డిమాండ్ చేస్తూ సోషల్ జస్టిస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు చామకూరు రాజు పటేల్ 17,శనివారం 10 గంటలకు స్థానిక ఎల్బీనగర్ చౌరస్తా బీసీ సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. బీసీ కులాలకు చెందిన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు అధ్యక్షులు పాల్గొని బీసీలకు సరైన న్యాయం చేసేంతవరకు మనందరి బాధ్యత పూర్తిగా ఉందనే వారు పిలుపునిచ్చారు. అన్ని కులాల నుండి తమకు మద్దతు ప్రకటించాలని సోషల్ జస్టిస్ పార్టీ కార్యవర్గ సభ్యులు తెలియజేశారు.