సిరిసిల్ల కాపు సంఘం ఆధ్వర్యంలో శివశంకర్ జయంతి
రాజన్న సిరిసిల్ల జిల్లా: మున్నూరుకాపు కళ్యాణ మండపంలో శనివారం స్థానిక మున్నూరు కాపు సంఘ నాయకులు జస్టిస్ పుంజాల శివ శంకర్ 95 వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించినారు. వీరు చేసిన సేవలను కొనియాడుతూ, జయంతి ఉత్సవాలను భాగంగా వారికి నివాళులర్పిస్తూ వీరి గురించి సంఘ నాయకులు స్మరించుకుంటూ జస్టిస్ పుంజాల శివశంకర్ బీసీ రిజర్వేషన్లకు ఆద్యులు, హైకోర్టులో న్యాయమూర్తి అయ్యారు. కేంద్రంలో శక్తిమంతమైన కేబినెట్ మంత్రి అయ్యారు కేంద్ర మంత్రి కావడ మనేది ఆయన జీవితంలో ఒక అనూహ్య మలుపు, శివశంకర్ జీవితం అటువంటి అనూహ్య మలుపులు ఎన్నిటినో చూసిందని ఆయన జీవితగాథ విశదం చేస్తుంది. దృఢ సంకల్పం,ఆవిరామ కృషితో ఆయన శిఖరాలను అధిరోహించారు.అవరో థాలను అధిగమించారు. సమాజంలోని బలహీన వర్గాల(శివశంకర్ సైతం ఈ సామాజిక వర్గాల నుంచి ప్రభవించినవాడే) అభ్యున్నతికి తాను చేయగలిగినదంతా చేశారు. గమనార్హమైన విషయమేమిటంటే వెనుకబడిన వర్గాల శ్రేయస్సునకు తాను చేయలుచుకున్నది చేసేందుకు ఆయన ఏ పదవి కోసమూ వేచి వుండలేదు. అధికారాన్ని కోరుకోలేదు. ఒక వ్యక్తిగా తాను చేయ గలిగినదంతా చేసిన ఉదాత్తుడు శివశంకర్ న్యాయవాద వృత్తిని చేపట్టిన నాటి నుంచి జీవితపు తుది దశ వరకూ బలహీన వర్గాల వారి పురోగతికి శివశంకర్ విశేష సేవలు అందించరని వక్తలు పేర్కొన్నారు.ఈ సందర్భంలో కొన్ని సూచనలను ప్రభుత్వానికి ఈ విధంగా తెలియజేస్తూ జస్టిస్ శివశంకర్ కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించి గౌరవించి వారి స్మారక పోస్టల్ స్టాంప్ విడుదల చేయాలి.భారత పార్లమెంట్ లో అతని చిత్రపటం ఆవిష్కరించాలి.కేంద్ర ప్రభుత్వం,రాష్ట్ర ప్రభుత్వం అతని జయంతి,వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలి,రాష్ట్ర ప్రభుత్వం ట్యాంక్ బండ్ పై శివ శంకర్ విగ్రహం నెలకొల్పాలి, నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయo కు శివశంకర్ పేరు పెట్టాలి, కొత్తగా నిర్మించబోయే తెలంగాణ హైకోర్టు ప్రాంగణానికి ఆయన పేరు పెట్టాలి ,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు శివశంకర్ జీవితచరిత్ర ని పాఠశాల కళాశాల పుస్తకాలలో పాఠ్యాంశంగా చేర్చాలి. తదితర అంశాలను పేర్కొంటూ డిమాండ్ చేశారు.