కాపు, బిసి సంఘాల ఆధ్వర్యంలో శివశంకర్ జయంతి
హైదరాబాద్: కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలో శనివారం కీర్తిశేషులు జస్టిస్ పుంజాల శివశంకర్ 95వ జయంతి వేడుకలను మున్నూరు కాపు సంఘం, బిసి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించినారు. నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడుతూ.మాజీ కేంద్రమంత్రి, హైకోర్టు మాజీ న్యాయమూర్తి, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ వ్యవస్థాపక కార్యదర్శి, న్యాయశిఖరం కీర్తిశేషులు దివంగత నేత పుంజాల శివశంకర్ 95వ జయంతి సందర్భంగా శనివారం ఉదయం కూకట్ పల్లి, బాగ్ అమీర్, వర్డ్ ఆఫీస్ దగ్గర, బంగారు మైసమ్మ గుడి పక్కన ఉన్న బీసీ జెండా దగ్గర జాతీయ బీసీ సంక్షేమ సంఘం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, బీసీ సంక్షేమ సంఘం, బిసి జర్నలిస్టు ఫోరం అధ్యక్షులు. మున్నూరుకాపు సంఘం, తెలంగాణ రాష్ట్రం, రాష్ట్ర కార్యదర్శి తెల్ల హరికృష్ణ ఆధ్వర్యంలో, ముదిరాజ్ సంఘం కూకట్పల్లి నియోజకవర్గం గుందడి యాదగిరి, మున్నూరుకాపు సంఘం,రాష్ట్ర గౌరవ సలహాదారులు ఆకుల వీరస్వామి సమక్షంలో పుంజాల శివశంకర్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ వర్కింగ్ చైర్మన్ తూము వినయ్ కుమార్, కూకట్ పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నయినేని చంద్రకాంతరావు, చింతపంటి భూమయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తూము ఎల్లారావు, మున్నూరు కాపు సంఘం బాగ్ అమీర్ గ్రామ గౌరవ అధ్యక్షులు ఆకుల లక్ష్మణరావు, అధ్యక్షులు చింతల యాదగిరి, ప్రధాన కార్యదర్శి అల్లం మహేష్ కుమార్, సభ్యులు దండే అశోక్, తెలంగాణ బీసీ వికాస్ సమితి, రాష్ట్ర అధ్యక్షులు బాశెట్టి నర్సింగ్ రావు, మున్నూరుకాపు సంఘం, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి నిరంజన్ రెడ్డి, వివేకానంద నగర్ డివిజన్ బిజెపి పార్టీ అధ్యక్షులు దానబోయిన నర్సింగ్ రావు, కూతురు సురేష్, కొల్ల శంకర్, అవినాష్, శ్రీకాంత్, రాకేష్, కృష్ణ, కరీం, సోలమన్ రాజు, జోరపురి అశోక్ తదితరులు పాల్గొని శివశంకర్ నివాళులర్పించారు.