సంఘం అభివృద్ధికి సహకరించండి.. ఆవుల రమేష్ పటేల్

0

హైదరాబాద్: మరో అంబేద్కర్, బీసీల హక్కులకై ఢిల్లీలో గళం విప్పి ఎన్నో బిసి కులాలకు ఆదర్శ పురుషుడిగా నిలిచినా మహనీయులు, మన మున్నూరుకాపుల ఐకాన్ గా నిలబడిన స్వర్గీయ జస్టిస్ పుంజాల శివశంకర్ జయంతి ఉత్సవాలను హైదరాబాద్ కాచిగూడ మున్నూరు కాపు ట్రస్టు మహాసభ ఆధ్వర్యంలో శనివారం ఉదయం నిర్వహించిన కార్యక్రమంలో మన కుల పెద్దలు కీర్తిశేషులు శివశంకర్ చేసిన సేవలను స్మరించుకుంటూ కాపుసంఘ నాయకులు వారి అభిమానులు సంఘ నాయకులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొని ఈ విధంగా కొన్ని సూచనలతో కూడిన మీడియాకు మున్నూరుకాపు నాయకుడు ఆవుల రమేష్ పటేల్ అందించిన సమాచారాన్ని ఈ విధంగా తెలియజేస్తూ..కుల పెద్దలను పూజ్యులు,కీర్తిశేషులు వారి యొక్క జయంతి, వర్ధంతులను,కార్యక్రమాలను ఏర్పాటు చేయండి.అన్ని మన కుల సంఘాలు,ట్రస్టు బోర్డు అయిన బ్యానర్, ఫేక్సిల పైన తప్పకుండా మన కుల పెద్దల ఫోటోలు ఉండాలి.అన్ని సంఘాల లోగోలు ఒకే విధంగా మన మున్నూరు కాపు రాష్ట్ర లోగో ఉండాలి.అలాగే ట్రస్టు అద్వర్యంలో ఏలాంటి సహాయం కార్యక్రమలు చేపట్టిన అకార్యక్రమాలకు మన కుల పెద్దల పేరు ఉండాలి విద్యార్థి వసతి గృహం ద్వారా ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ,నగదు ప్రతిభా పురస్కారములు,బ్యాంక్ సౌకర్యం స్కూల్/ కాలేజీ ఫీజు చెల్లింపు,వైద్య ఆరోగ్య కేంద్రం,నైపుణ్యం శిక్షణా కేంద్రం/ వృత్తి శిక్షణ కేంద్రము, ఏర్పాటు చేసుకుని పిల్లల నోటు బుక్స్ పైన మన కుల పెద్దల ఫోటోలను ముద్రిద్దాం,మున్నూరుకాపుల ఐక్యత కోసం,అభివృద్ధి కోసం,పేద విద్యార్థుల కోసం అభివృద్ధి కోసం మరింత చోరవ చూపుదాం.మన హస్టల్లో ఉన్న విద్యార్థుల కోసం కనీస సౌకర్యాలను కల్పిద్దాం, స్వర్గీయ జస్టిస్ పుంజాల శివశంకర్ వారి సంకల్పంతో కాచిగూడ మున్నూరుకాపు ట్రస్టు ఏర్పడింది.ఈ ట్రస్టు బోర్డును కాపాడుకోవాల్సిన అవసరం మన అందరిదీ ఉన్నది.ట్రస్టు ఆదాయం సమకూర్చుకొనుటకు దానిలోనే భాగంగా ట్రస్ట్ భవనంలో ముందు షాపులు ఉన్నాయి,వారు తక్కువ కిరాయిలు ఇస్తున్నారు.అట్టి కిరాయిలను పెంచి ట్రస్ట్ ఆర్థికంగా సమకూర్చే విధంగా ఏర్పాటు చేయాలి.ఈకార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా ట్రస్టు బోర్డు సభ్యులకీ మహాసభ, కర్యవర్గ సభ్యులకి అభినందనలు తెలియజేశారు.రాష్ట్ర సంఘంలో కొట్లాలు కేసులు బంద్ చేయండి.మున్నూరుకాపు యువతను ప్రొత్సహించండి. జిల్లా ప్రాంతంలో ఉన్న వారి అందరికీ రాష్ట్ర సంఘములో గుర్తింపు తేండి.అన్ని జిల్లాలలో ఉన్న నాయకులకు రాష్ట్ర సంఘంలో ప్రాతినిధ్యం కల్పించండి.స్వర్గీయ జస్టిస్ పుంజాల శివశంకర్  జయంతి ఉత్సవాలను తెలంగాణ మున్నూరు కాపులు ఒకే వేదికపై జరపాలని కోరుతున్నా, బీసీ సమాజంలో మనకు మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. రాష్ట్రంలో ఒకే పెద్ద సంఘంగా ఉండాలి దానికి ఒక్కరే అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహించాలి. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క మున్నూరు కాపు నాయకులు ఈ సమాచారాన్ని పాటిస్తే మనకు, మన కులానికి, ట్రస్టు బోర్డు కి మంచి పేరు వస్తుందని, రాబోయే తరం వారికి ప్రభుత్వ  పరంగా ఎన్నో లబ్ధి పొందుతారని సమావేశంలో తెలిపారు. 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *