మలేషియా స్టడీ టూర్ వెళ్లనున్న ఎంపీ పుట్ట మహేష్

0

ఏలూరు: ఆంధ్రప్రదేశ్ లో  పొగాకు రైతుల సమస్యలు పరిష్కరించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్, పామాయిల్ రైతుల సమస్యల పరిష్కారమే తన తదుపరి ప్రాధాన్యత అన్నారు.ఆయిల్ ఫామ్ రైతు సంఘాల నాయకులు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వారి ఏలూరు క్యాంపు కార్యాలయంలో కలసి పామాయిల్ రైతుల సమస్యలు విన్నవించి, పరిష్కరించాలన్నారు.పెదవేగి ఆయిల్ ఫెడ్ రైతు సంఘం అధ్యక్షులు ఉండవల్లి వెంకట్రావు మాట్లాడుతూ కోకోతో సహా ఉద్యానవన పంటల మీద కూడా దృష్టి పెట్టాలని,జిల్లాలో చాక్లెట్ ఫ్యాక్టరీ పెట్టాలని కోరారు.రాష్ట్ర ఆయిల్ ఫామ్ అద్యక్షులు బొబ్బా రాఘవరావు,జాతీయ ఆయిల్ ఫామ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి క్రాంతికుమార్ రెడ్డి మాట్లాడుతూ 2022లో పామాయిల్ దిగుమతుల పై 49% ఉన్న సుంకాన్ని 0 చేశారని ఆ కారణంగా దేశంలో ఆయిల్ పామ్ రైతులకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నారు.ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ పామాయిల్ రైతుల సమస్యల పరిష్కారం కోసం డిల్లీలో సంబంధిత కేంద్ర ప్రభుత్వ సెక్రటరీని కలిశానని ఆయన మలేషియా వెళ్ళి అక్కడి పామాయిల్ పంట పండించే పరిస్థితులను తెలుసుకోవాలని సూచించారని, అందుకోసం వచ్చేనెలలో మలేషియా వెళ్తానన్నారు.అలాగే వివిధ పంటలు పండించే రైతుల కోసం జిల్లాలో ఇంక్యుబేషన్ సెంటర్ను ఎంపీ పుట్టా మహేష్ కుమార్ నేలకొల్పుతామన్నారు.ఎంపీని కలసిన వారిలో పామాయిల్ రైతులు కొసరాజు రాధాకృష్ణ, కొల్లి శ్రీను,ధన కోటేశ్వరరావు,సిహెచ్ హనుమంతరావు,శ్రీనివాస రెడ్డి,సత్యనారాయణ మరియు వందలాదిగా రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *