బలిజ పేద వితంతువుకు కుట్టు మిషన్ అందజేత
నెల్లూరు జిల్లా కార్పొరేషన్ లోని,47వ డివిజన్లో గుప్తా పార్క్ వద్ద పొర్లకట్టపై నివసిస్తున్నటువంటి పాపిశెట్టి పద్మ వతి భర్త చిన్న వయసులోనే కోల్పోయినప్పటి నుండి తనకు కలిగిన సంతానం ఇద్దరు చిన్న బిడ్డలను ఐదవ తరగతి,ఆరవ తరగతి చదివించుకొనుటకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు.వీరు మన సామాజిక వర్గానికి చెందిన ఆడపడుచు కావడంతో పాపశెట్టి పద్మావతి జీవనోపాధి కోసం జిగ్జాగ్ టైలరింగ్ మిషన్ యంత్రం కు ఆగస్టు మంగళవారం బలిజ చేయూత ఫౌండేషన్ ద్వారా 7500/-బలిజ చేయూత ఫౌండేషన్ ఆఫీస్ వద్ద అందజేశారు. అందించిన దాతలు గాదిరాజు దినేష్ కుమార్ నుండి ఒక వెయ్యి రూపాయలు శ్రీమతి సీతల కనకదుర్గ కెనరా బ్యాంకు ఎజిమ్ ఐదు వందల రూపాయలు కమతం సుబ్బారావు ఐదు వందల రూపాయలు దాదాపు మొత్తం 9500 రూపాయలను, బలిజ చేయూత ఫౌండేషన్ ఆఫీస్ వద్ద అందించారు.శ్రీమతిపాపిశెట్టి పద్మావతి జీవనోపాధి కోసం అందించిన దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు ఇది కేవలం అందించే సహాయం బలిజ చేయూత ఫౌండేషన్ సభ్యుల సహకారంతో మాత్రమే ఇతరుల నుంచి ఒక్క రూపాయి కూడా విరాళాల రూపంలో స్వీకరించబడవు.ఇలాంటి కార్యక్రమాలు బలిజ చేయుత ఫౌండేషన్ అందిస్తున్నందుకు సభ్యులందరికీ యావత్తు కాపులందరూ అభినందిస్తున్నారు.