రాష్ట్ర మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
హైదరాబాద్: ఇటీవల బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అత్యాచారాలు దాడులను ఖండిస్తూ తెలంగాణ మున్నూరు కాపు మహాసభ కాచిగూడ ఆధ్వర్యంలో శనివారం రాత్రి కొవ్వొత్తుల నిరసన, ర్యాలీ నిర్వహించారు.కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మున్నూరుకాపు మహాసభ అధ్యక్షులు మణికొండ వెంకటేశ్వరరావు, మాట్లాడుతూ మహిళలపై, అలాగే హిందువులపై అది దారుణంగా హింసించబడుతున్న బంగ్లాదేశ్ లో ప్రభుత్వం సరైన పరిష్కారం చూపించక అక్కడి హిందూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దాడులను ఖండిస్తూ ప్రపంచవ్యాప్తంగా ర్యాలీ కార్యక్రమాలను నిర్మించగలరని వెంకటేశ్వరావు తెలిపారు, ఇట్టి కార్యక్రమంలో, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఆఫీస్ సిబ్బంది తోపాటు, గ్రేటర్ మున్నూరుకాపు కుల సంఘాల నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.