బీసీల సత్యాగ్రహ దీక్ష చేపట్టిన సోషల్ జస్టిస్ పార్టీ

0

 

హైదరాబాద్: తెలంగాణలో 45 శాతం ఉన్న బీసీ కులాలను రాబోయే మండల ఎలక్షన్లో వారికి సరైన ప్రాతినిత్యం కల్పించి వివిధ పార్టీల నుండి టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం బీసీల కుల గణన తెలిపి ఎన్నికల నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి పలు డిమాండ్లతో శనివారం సోషల్ జస్టిస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బీసీ నాయకులు చామకూరి రాజు ఆధ్వర్యంలో ఎల్బీనగర్ లోని మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద జరిగిన బీసీల సత్యాగ్రహ దీక్ష చేపట్టినారు.ఇట్టి కార్యక్రమంలో వివిధ బీసీ కుల సంఘ అధ్యక్షులు కార్యదర్శులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు దీక్షలో పాల్గొన్నారు, దీక్ష చేస్తున్న వారికి వారు పూర్తి మద్దతును తెలిపారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ చంద్రవర్ధన్,తెలంగాణ ఉద్యమ నేత సీనియర్ జర్నలిస్టు పల్లె రవికుమార్ గౌడ్, డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్లు, సీనియర్ జర్నలిస్టు మాలి కరుణాకర్ పటేల్, బత్తుల సిద్దేశ్వర పటేల్, ఉగ్గే శ్రీనివాస్ పటేల్, అనికేత్ పటేల్, బత్తుల రాముల పటేల్, సోషల్ జస్టిస్ పార్టీ నాయకులు, కెవికె గౌడ్,చిన్న శ్రీకాంత్ తదితరులు పాల్గొని దీక్ష శిబిరాన్ని విజయవంతం చేశారు. దీక్షా శిబిరానికి విచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి చామకూరి రాజు అభినందనలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *