బీసీలు అంటే ఏమిటో చూపిస్తా.. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

0

హైదరాబాద్: తెలంగాణలో గత కొన్ని ఏళ్లుగా బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీల కోసం పోరాడిన వారిని మభ్యపెట్టి లొంగ తీసుకున్న ప్రయత్నం గతం పాలకుల నుండి  జరుగుతుంది. ఇకనుంచి అలాంటి ఆటలు సాగవని హెచ్చరిస్తూ బీసీలకు 42% రిజర్వేషన్‌ కల్పించకపోతే  బీసీలు అంటే ఏమిటో చూపిస్తాం లేకుంటే భూకంపం సృష్టిస్తానని  బీసీల రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిడ్డలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలు చేయకపోతే భూకంపం సృష్టిస్తానని హెచ్చరించారు. రిజర్వేషన్‌ ను అమలు చేయకపోతే ప్రజల్లో ఒక్కరు కూడా తిరగలేరని, రాహుల్‌ గాంధీ ఇచ్చిన మాటను అమలుచేసి తీరాల్సిందేనని పేర్కొన్నారు. తెలంగాణలో బీసీ సర్కారు రాబోతోందన్నారు.బిచ్చగాళ్లలా కుల సంఘాలకు రూ.50 కోట్లను ఏ లెక్కన కేటాయిస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో ఏ పార్టీ చెందిన బీసీ ముఖ్యమంత్రి కాలేకపోయాడని అందుకు కారణం బీసీ ల ఐక్యత లేదని, ఓసీల పాలన సాగుతుందని, దానికి త్వరలోనే నాంది పలికే ఆసన్నమైందని తెలిపారు. తెలంగాణలో ఉన్న బీసీలంతా మమేకమై అన్ని బిసి కులాల వారికి సరైన న్యాయం త్వరలోనే జరుగుతుందని మల్లన్న తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *