నిరుపేద వధువుకు పట్టు చీర అందజేసిన పిల్లి శ్రీనివాస్
హైదరాబాద్: సికింద్రాబాద్ కు మున్నూరు కాపు నిరుపేద కుటుంబానికి చెందిన రంగరాజు శ్రీనివాస్ సునీత పుత్రిక కుమారి సాయి భార్గవి కి వివాహం జరుగు నిమిత్తం కోసం హైదరాబాద్ మున్నూరు కాపు రాష్ట్ర సంఘం అధ్యక్షుడు పిల్లి శ్రీనివాస్ నుండి వారికి మంగళవారం పదివేల ఐదు వందల రూపాయల విలువ గల పట్టు చీరను దంపతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు యువకుమండలి ఏనుగుల హరీష్, పత్తి అనిల్, సికింద్రాబాద్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు చేపూరి వెంకటేశ్వర్లు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.