చికిత్స కోసం ఆర్థిక సాయం అందించండి-పల్లె రాజేశ్వరి

0

 

హైదరాబాద్ : మీరిచ్చే సహాయం నాకెంతో మేలు, ఆర్థిక సహాయం కోసం వేడుకుంటున్న… మహిళ  ప్రజ సంక్షేమ కోసం, పాటు పడుతూ, తెలంగాణ ఉద్యమం లో తన గానంతో పల్లె కోయిలమ్మగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న  మున్నూరు కాపు ముద్దుబిడ్డ పల్లె రాజేశ్వరి పటేల్ ఇటీవల తీవ్ర అనారోగ్యంతో  బాధపడుతున్నరు, ప్రస్తుతం వరంగల్ ములుగు రోడ్డు లో ఉన్న గార్డియన్ హాస్పటల్లో తన రెండు కాళ్లకు డాక్టర్ ఖాళి ప్రసాద్ పర్యవేక్షణలో చికిత్స జరుగుతున్నది. సరైన సమయంలో చికిత్స ఎంతో అవసరం లేకుంటే తమ రెండు కాళ్లు నడవడానికి పనికిరావని డాక్టర్ తెలియజేశారు. చికిత్స కోసం చాలా డబ్బులు అవసరం ఉన్నాయి. వీరి కుమారుడు ఉద్యమం కోసం తన ప్రాణాలను సైతం విడిచాడు, వీరికి నా అనే వాళ్ళు ఎవరూ లేరు, రాజేశ్వరి ఇతరుల కోసం ఎంతో పాటుపడుతుండేది, ఇటీవల వీరికి సర్దార్ పుటం పురుషోత్తం రావు పటేల్ పదివేల రూపాయలను వారికి అందజేశారు, దీనిలో కొత్తపేట చెందిన అల్పూరి ప్రదీప్ కుమార్ పటేల్ సొంతగా 5000 రూపాయలు పంపించడం జరిగినది. వీరి చికిత్స కోసం ఇంకా చాలా డబ్బులు అవసరం ఉన్నాయని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. మనమందరం మానవ దృక్పథంతో ముందుకు వచ్చి మీరు ఇచ్చే సహాయం వారికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ సమాచారాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరు తమకు తోచిన ఎంత సహాయమైనా వీరి నెంబర్ కి గూగుల్ పే ద్వారా పంపించండి. పల్లె రాజేశ్వరి పటేల్ సెల్:99 49 67 55 04 దయచేసి ఈ నెంబర్కు మీ సహాయాన్ని అందజేయగలరని పల్లె రాజేశ్వరి పటేల్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *