తిరుమల కొండపైకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

0
తిరుపతి జిల్లా : వచ్చే1వ తేదీన అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ తెల్లారి రెండవ తేదీ ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామిని వారిని దర్శించుకొని ప్రాయశ్చిత్త దీక్ష విరమణ చేస్తారు. మూడవ తేదీ తిరుమలలో వారాహి సభను ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు.శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించి అపవిత్రం చేసిన విషయం వెలుగులోకి వచ్చిన దరిమిలా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సంగతి విదితమే. సోమవారానికి దీక్ష రెండో రోజుకు చేరుకుంది. వీరు గత 11 రోజుల నుండి దీక్షను తిరుమల ఏడుకొండల స్వామిని దర్శించుకొని విరమిస్తారు. తిరుపతిలో వారాహి సభను నిర్వహించాలని మంత్రి పవన్ కళ్యాణ్  నిర్ణయం తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *