దీన్ దయాల్ ఉపాధ్యా జయంతిలో-గంట రవికుమార్

0

వరంగల్ జిల్లా : దేశ సేవయే జీవిత పరమావధిగా,తన చివరి క్షణం వరకు దేశం కోసమే పాటుపడిన మహోన్నతమైన వ్యక్తి దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా 42 వ డివిజన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరంగల్ బిజెపి జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ కొనియాడారు. భారతీయత, ధర్మం, ధర్మరాజ్యం అంత్యోదయ భావనలతో, భారతీయ సంస్కృతి పునాదిపై బలమైన  సంపన్నమైన భారత దేశాన్ని నిర్మించడం, ఇది అందరికీ స్వేచ్ఛ, సమానత్వం,న్యాయం జరగాలనే ఉద్దేశం గల మహనీయుడు, ప్రతి వ్యక్తినీ అభివృద్ధి వైపు, సమృద్ధి వైపు, సంతోషం వైపు తీసుకువెళ్లగల ఉత్తమ సిద్ధాంతం ఏకాత్మ మానవ వాదం,మహా తత్త్వవేత్త, రాజకీయ మేధావి,సామాజికవేత్త “పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యయ”వారి జయంతి సందర్భంగా డివిజన్ అధ్యక్షులు తాళ్లపల్లి అర్జున్ గౌడ్ ఆధ్వర్యంలో రంగశాయిపేట 42వ డివిజన్,206వ బూత్ లో నివాళులర్పించిన  బిజెపి జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్, కార్య్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మాచర్ల దీన్ దయల్, జిల్లా కార్యవర్గ సభ్యులు కర్నె రవీందర్, బిజెపి నాయకులు బక్కీ రంజిత్ కుమార్, అరె కార్తీక్, బూత్ అధ్యక్షులు ధారబోయిన అనిల్, వేణుగోపాల చారి  తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *