బాసర మున్నూరుకాపు సత్రస్థలం కు విరాళం

నిర్మల్ జిల్లా : ప్రసిద్ధ పుణ్య క్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాత మందిరం సమీపంలో మున్నూరుకాపు వసతి నిత్యాన్నదాన సత్రం కొరకు స్థలం అందరు కలిసి కొనుగోలు చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఇట్టి కొనుగోలుకు విరాళాల సేకరణ కోసం ముధోల్ నియోజకవర్గ మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు రోళ్ళ రమేశ్ తోపాటు నియోజకవర్గం లోని అన్ని మండలాల కుల పెద్దల ఆధ్వర్యంలో జరుగుచున్నది. దీనిలో భాగంగా సోమవారం నిజామాబాదు జిల్లా కేంద్రంలో విరాళాలు అందించిన దాతలు. నిజామాబాద్ జిల్లా ముబారక్ నగర్ కు చెందిన క్యాతం ఆనంద్ పటేల్ తండ్రి కీశే చిన్న గంగారాం, ఒక్క లక్ష ఒక్క వేయి నూట పదహారు రూపాయలు విరాళంగా ఇచ్చినారు. అలాగే వీరితోపాటు ప్రముఖ వ్యాపారవేత మాణిక్ బండార్ కు చెందిన ఆకుల రజనీష్ పటేల్ తండ్రి రామ్ కిషన్ లక్ష ఒక్క వేయి రూపాయలు విరాళంగా ఇచ్చినారు.విరాళాలు అందిస్తున్న వారు అలాగే విరాళాల సేకరణకు సహకరిస్తున్న వారికి సరస్వతి మాత కృపా కటాక్షములు ఉండాలని కోరుతూ సేకరణ కార్యక్రమంలో రోళ్ళ రమేశ్ పటేల్ తో పాటు ముబారక్ నగర్ మాజీ సర్పంచ్ క్యాతం హన్మండ్లు ,ఎల్లమ్మ గుట్ట మున్నూరుకాపు సంఘం మాజీ అధ్యక్షులు, నాయకులు, వ్యాపారవేత్త బొబ్బిలి వేణు పటేల్, జిల్లా కార్యవర్గ యువ నాయకులు కొట్టే హన్మండ్లు పటేల్ తాలూకా సంఘం కార్యవర్గ సభ్యులు నానం నర్సయ్య పటేల్ ,లోకేశ్వరం మండల సంఘం అధ్యక్షులు మంద లింగన్న పటేల్ తో పాటు కుల పెద్దలు పాల్గొన్నారు.