ఆదివారం మహిళా మున్నూరు కాపు బతుకమ్మ ఉత్సవాలు

0

హైదరాబాద్: తెలంగాణలో అతిపెద్ద మహిళా పండుగ సద్దుల బతుకమ్మ ఈ పండుగను తెలంగాణలో ఉన్న మహిళలు ఎంతో ఆనందోత్సవంతో పిల్లా పాపలతో నూతన వస్త్ర ధరించి సాంప్రదాయబద్ధంగా పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా రావడం జరుగుతుంది.ఇదే తరహాలో మున్నూరుకాపు చెందిన మహిళలు బతుకమ్మ పండుగను ఈ నెల 6 ఆదివారం సాయంత్రం 6 గంటలకు కాచిగూడ సంఘ భవనంలో నిర్వహిస్తున్నట్లు మహిళా అధ్యక్షురాలు ఆత్మకూరు ప్రీతి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇందులో భాగంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఉత్సవాలకు ప్రత్యేక ఆహ్వానితులుగ  ఈరోజు కలిసి ఆహ్వానం పలికారు. అందుకు తీన్మార్ మల్లన్న స్పందించి బతుకమ్మ పండుగను మున్నూరుకాపు మహిళా పండుగను భారీ ఎత్తున నిర్వహించేటట్లు సమిష్టిగా కృషి చేద్దామని వారికి హామీ ఇచ్చినట్లు తెలిపారు. వీరితోపాటు ట్రస్ట్ దడువై రాఘవేంద్ర, మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు ను కూడా ఆహ్వానం పలికారు.ఆహ్వానం పలికిన వారిలో రాష్ట్ర అధ్యక్షులు మణికొండ వెంకటేశ్వర్లు,కట్టెల సుభాస్, అనంతుల ప్రహలద్, పొన్నం బాలరాజు, కావేటి గోవిందు,హజారి రామ్మోహన్, మహిళా విభాగానికి చెందిన కార్యదర్శి పొన్నం సునీత, కల్పన తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *