రోడ్డుపైన బెటయించిన బిఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు

0


తెలంగాణ: మైబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర మహబూబాబాద్ ఏస్పీ క్యాంప్ కార్యాలయం ఎదుట పార్టీ ప్రముఖులతో కలిసి బుధవారం రాత్రి రోడ్డుపై బైఠాయించారు.రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు, ఎస్సీ, ఎస్టీ,బీసీ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు గురువారం మహబూబాబాద్ లో తలపెట్టిన మహాధర్నాకు అనుమతివ్వాలంటూ ఎంపీ రవిచంద్ర ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్ రావు,సత్యవతి రాథోడ్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి,మాజీ ఎంపీ మాలోతు కవిత తదితర ప్రముఖులతో కలిసి ఆందోళనకు దిగారు.మాజీ మంత్రి, ఎమ్మెల్యే, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మహాధర్నాకు మొదట అనుమతిస్తామని ఏస్పీ మాట ఇచ్చి ఇప్పుడు ముఖం చాటేస్తున్నారంటూ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద పెట్టున నినాదాలిచ్చారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు”నశించాలి నశించాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవలంభిస్తున్న రైతు,ఎస్సీ,ఎస్టీ,బీసీ,ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి”,”డౌన్ డౌన్ బీఆర్ఎస్ తలపెట్టిన మహాధర్నాకు అనుమతి స్తామని చెప్పి మాట ఏస్పీ డౌన్ డౌన్”,”జిందాబాద్ జిందాబాద్ బీఆర్ఎస్ జిందాబాద్”,”ఉపసంహరించాలి ఉపసంహరించాలి లగచర్లలో రైతులపై బనాయించిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించాలి”వర్థిల్లాల్లి వర్థిల్లాల్లి కేసీఆర్ నాయకత్వం వర్థిల్లాలి”,”అనుమతివ్వాలి అనుమతివ్వాలి కేటీఆర్ పాల్గొనే మహాధర్నాకు అనుమతివ్వాలి”అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ ఆందోళనలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, జెడ్పీ మాజీ ఛైర్ పర్సన్ అంగోతు బింధు,బీఆర్ఎస్ నాయకులు రవికుమార్ నాయక్,యాకూబ్ రెడ్డిలతో పాటు పలువురు పార్టీ ప్రముఖులు,వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *