చదివితే విజయం..అమెరికన్ యువ సైంటిస్ట్ డాక్టర్ టి.శ్రవణ్

0

న్యూయార్ : విద్యార్థులు ఒక ప్రణాళికబద్ధంగా అంశాల వారీగా చదివితే విజయం సాధ్యమేనని అమెరికాలో యువ సైంటిస్టు గా పనిచేస్తున్న వరంగల్ జిల్లాకు చెందిన డాక్టర్ తోట శ్రవణ్ కుమార్ అన్నారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగంలో జరిగిన సెమినార్ లో ఆయన మాట్లాడుతూ కష్టపడి చదివితే రసాయనశాస్త్రంలో అద్భుత ఫలితాలు సాధించవచ్చని విద్యార్థులకు ఆయన హితబోధ చేశారు. కాకతీయ యూనివర్సీటీ కెమిస్ట్రీ ఇంటిగ్రేటెడ్ కోర్సు మొదటి బ్యాచ్ స్టూడెంట్ అయిన ప్రొఫెసర్ల పర్యవేక్షణలో అన్ని అంశాలను ఆకలింపు చేసుకొని, శ్రమించి ఎదిగానని చెప్పారు. ఈ సందర్భంగా కెమిస్ట్రీలో ఎలా రాణించవచ్చు అనే అంశాలపై ఆయన విద్యార్థులతో క్లుప్తంగా పలు అంశాలను పంచుకున్నారు.విద్యార్థుల కష్టాలు తనకు తెలుసుననీ, కేయూ కెమిస్ట్రీ విభాగం విద్యార్థులకు ఏ సందేహాలు ఉన్నా తనను సంప్రదించవచ్చని, వాటిని తీర్చడానికి తాను సిద్ధంగా ఉన్నానని వారికి హామీ ఇచ్చారు.  డాక్టర్ శ్రవణ్ లెక్చరర్ విద్యార్థులకెంతో ఉపయోగపడిందని కెమిస్ట్రీ డిపార్ట్ మెంట్ హెడ్ సవితా జ్యోత్స్న పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *