చంద్రయ్యకు నివాళులర్పించిన ట్రస్ట్ సభ్యులు

0

యాదాద్రి భువనగిరి జిల్లా: యాదాద్రి జిల్లా కమటం గూడెం చెందిన ఏనుగుల చంద్రయ్య దశదినకర్మ గురువారం రోజు స్థానిక ఏనుగుల చంద్రయ్య మినీ హాల్ ఆలేరు సమీపంలో జరిగినది. చంద్రయ్య యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి మున్నూరు కాపు నిత్య న్నదాన సత్రం కు నిర్మాణానికి విశేషంగా కృషి చేశారని, ఫౌండర్ అధ్యక్షులుగా మంచి పేరు సంపాదించుకున్నారని కొనియాడుతూ వారి చేసిన సేవలు ట్రస్టు స్మరించుకుంటూ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ట్రస్ట్ సభ్యులు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ చంద్రయ్య కుమారులు ఏనుగుల ప్రమోద్, ప్రవీణ్ కుమారులకు ఓదార్పు తెలియజేశారు. ట్రస్టు సభ్యులు కోలా అంజయ్య పటేల్, బుక్క వేణుగోపాల్ పటేల్, బూర్గుబావి సత్యనారాయణ పటేల్, పుప్పాల నరసింహులు పటేల్, పలుగుల శ్రీనివాస్ పటేల్, సింగం సత్తయ్య పటేల్, వేముల రవీంద్ర పటేల్, డాక్టర్ ఆకుల నరేష్ పటేల్, పుప్పల యుగంధర్ పటేల్, ఎం కె పటేల్ న్యూస్ ఛానల్ ఎడిటర్ మాలి కరుణాకర్ పటేల్, అలుగుల లింగమూర్తి పటేల్, తదితరులు చంద్రయ్య పటానికి నివాళులర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *