లుక్క హిమజకు జాతీయస్థాయి అవార్డు ప్రధానం

0

న్యూఢిల్లీ:ఉస్మానియా విశ్వవిద్యాలయం కాంపస్ లోని లా కళాశాల విద్యార్థిని లుక్కా హిమజ, “భారతదేశంలో సమకాలిక ఎన్నికలు: ఒక దేశం, ఒక ఎన్నిక” అనే అంశంపై జాతీయ స్థాయిలో నిర్వహించిన ప్రతిష్టాత్మక ఆర్గ్యుమెంటేటివ్ రచన పోటీలో అండర్ గ్రాడ్యుయేట్ విభాగంలో రెండవ బహుమతిని గెలుచుకుంది.ఈ పోటీని భారత సామాజిక శాస్త్ర పరిశోధన మండలి (ICSSR), న్యూఢిల్లీ నిర్వహించింది.ఈ బహుమతిని న్యూఢిల్లీ లోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లో 05.డిసెంబర్  జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి శ ధర్మేంద్ర ప్రధాన్ ముఖ్యఅతిథిగా పాల్గొని అందజేశారు.ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ప్రముఖ అధ్యాపకులు మరియు నిపుణులు పాల్గొని యువ పతాకరత్నాలను ప్రోత్సహించారు.ఒక దేశం, ఒక ఎన్నిక” పై లుక్కా హిమజ వెలువరించిన అభిప్రాయం స్పష్టముగాను, సమగ్రముగాను ఉండటంతో ఆమెను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ వ్యాసంలో సమకాలిక ఎన్నికలపై ఉన్న అనుకూలత అలాగే వ్యతిరేకతలను సమన్వయంగా చర్చించి, భారతదేశంలోని రాజకీయ వ్యవస్థపై దీని ప్రభావం ఎలా ఉండబోతుందో చేశారు.ఈ సందర్భంగా లుక్కా హిమజ మాట్లాడుతూ, “ఉస్మానియా విశ్వవిద్యాలయం లోని అధ్యాపక బృందానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.ఈ గుర్తింపు నాకు మరింత ప్రేరణనిస్తుంది. రాబోయే కాలంలో భారతదేశం యొక్క రాజకీయ, సామాజిక అంశాలపై నా పరిశోధన కొనసాగించాలని అనుకొంటున్నాను” అని పేర్కొన్నారు.ఈరచన పోటీ ద్వారా,యువతలకు సమకాలిక భారత రాజకీయ సమస్యలపై చర్చించే అవకాశం అందించడమే కాకుండా,”ఒక దేశం ఒక ఎన్నిక” అంశంపై విస్తృతమైన చర్చకు కూడా భారత సామాజిక శాస్త్ర పరిశోధన మండలి తెర తీసింది.ఈ కార్యక్రమం ముగింపులో, కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, భారత ప్రభుత్వ విధానాల రూపకల్పనలో ఈ విజేతలు పాలుపంచుకోవాలని కోరారు.హిమజ సాధించిన ఈ విజయం ఉస్మానియా విశ్వవిద్యాలయ సిగలో మరొక కలికి తురాయిని చేర్చింది.హిమజ వారి తండ్రి చంద్రశేఖర్ హైకోర్టు న్యాయవాదిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *