కాంగ్రెస్ పాలనపై ధ్వజమెత్తిన కేంద్రమంత్రి బండి సంజయ్
హైదరాబాద్: తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసి పరిపాలిస్తున్నారని తెలంగాణ ప్రజలను నమ్మకద్రోహం చేస్తే అధికారంలోకి వచ్చారని కాంగ్రెస్ పార్టీ పాలనపై కేంద్ర మంత్రివర్యులు కరీంనగర్ ఎంపీ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ధ్వజమెత్తారు. శనివారం ఎల్బీనగర్ బిజెపి పార్టీ బహిరంగ సభ లో పాల్గొని ప్రసంగిస్తూ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు చెప్పి ఓట్లు వేసుకున్నారు అమలు చేయకపోవడం ప్రజలు చీకొట్టే దశకు వచ్చారని కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూల్పోయే దశలో ఉందని తెలుపుతూ బిఆర్ఎస్, కాంగ్రెస్ రెండు ఒకటేనని దీనిపైన తెలంగాణ ప్రజలు బెదిరించే దశలో అసన్నమైందనే తెలుపుతూ రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలతో తెలంగాణ ప్రజల మోసం చేస్తూ పరిపాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ప్రధాని అవాజ్ యోజన కింద 5 లక్షల రూపాయలు నిరుపేదలకు ప్రధాన మోడీ ఇస్తున్నారని, దీనితో పాటు ఉచిత రేషన్ బియ్యం, రహదారుల నిర్మాణం, సబ్సిడీపై గ్యాస్, ఆరోగ్య రక్ష, ఎన్నో పథకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇస్తున్నారని, వీటిని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్టు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని సంజయ్ హేళన చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఎంపీలు డాక్టర్ కే లక్ష్మణ్, ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, విశ్వేశ్వర్ రెడ్డి, డీకే అరుణ, రఘునందన్, ఎమ్మెల్యేలు వెంకట రమణారెడ్డి, రాకేష్ రెడ్డి, పాయల్ శంకర్, పటేల్ రామారావు, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, సురవరం సుధాకర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, ఆకుల విజయ, మూగ జయశ్రీ, మరీ శశిధర్ రెడ్డి, మహేశ్వరం బిజెపి నియోజకవర్గ అధ్యక్షులు అందే శ్రీరాములు యాదవ్, భేతి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు, నియోజకవర్గ ఇన్చార్జీలు, తదితరులు పాల్గొన్నారు.