ఎంపీ వద్దిరాజు నిమ్స్ ఆస్పత్రికి ఎలక్ట్రిక్ బగ్గీ బహుకరణ
హైదరాబాద్:రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారు.తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రముఖమైన,పెద్ద ఆస్పత్రి నిమ్స్ కు ప్రతినిత్యం రోగులు,వారి సహాయకులు,సందర్శకులు వేల సంఖ్యలో వస్తూ పోతూ ఉంటారు.వీరి సౌకర్యార్థం, సౌలభ్యం కోసం రవిచంద్ర తన ఎంపీ నిధుల నుంచి ఎలక్ట్రిక్ బగ్గీ అందజేశారు.దీనిని ఎంపీ వద్దిరాజు నిమ్స్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ తో కలిసి మంగళవారం సాయంత్రం ప్రారంభించారు.ఎంపీ రవిచంద్ర కొబ్బరికాయ కొట్టి,ఆకు పచ్చజెండా ఊపి,రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి బగ్గీని నడిపారు.ఎంపీ వద్దిరాజు ఈ ఆస్పత్రికి గతంలో కూడా రెండు బగ్గీలను సమకూర్చారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్రను డాక్టర్ లక్ష్మీభాస్కర్, పీఆర్వోలు సత్యాగౌడ్, వరలక్ష్మీ,ఉషా తదితరులు శాలువాలతో సత్కరించి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ బగ్గీని ప్రారంభించిన సందర్భంగా ఎంపీ వద్దిరాజు, డాక్టర్ లక్ష్మీ భాస్కర్ లను యూత్ లీడర్ సూర్య విష్ణు శాలువాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు అభిమానులు, కాంట్రాక్ట్ సూపర్వైజర్ పాల్గొన్నారు.