హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణ మహోత్సవం కాచిగూడ మేడమ్ అంజయ్య హాల్లో మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి శ్రీనివాసు దంపతుల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రస్ట్ చైర్మన్ ప్రొఫెసర్ మేడం వెంకట్రావు దంపతులు పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీతారాముల కల్యాణ మహోత్సవానికి మున్నూరుకాపు మహాసభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు గత రెండు రోజుల నుంచి ప్రచారం సాగుతున్న తరుణంలో స్థానిక హైదరాబాద్ చెందిన పిల్లలు స్త్రీలు దంపతులు చాలామంది ఈ మహోత్సవానికి హాజరైనారు. స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందరికీ అందజేసి చక్కని భోజనంతోపాటు అల్పాహారాన్ని కూడా మున్నూరు కాపు విద్యార్థి వసతి ట్రస్టు ద్వారా ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులను సన్మానించి వారికి తీర్థ ప్రసాదాలను కూడా అందించడం జరిగినది. కాచిగూడ మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం లో గత కొన్ని సంవత్సరంల నుండి ఈ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్లు దానిలోనే భాగంగా ఈ సంవత్సరం కూడా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు అధ్యక్షులు పిల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఈ కళ్యాణ మహోత్సవం ద్వారా తెలంగాణలో ఉన్న మున్నూరు కాపులందరికీ కుటుంబాలకు అందరికీ మంచి జరగాలని కోరుతూ స్వామివారిని వేడుకున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి సెంట్రల్ కోఆర్డినేటర్ నూనె బాలరాజును, ఉప్పల్ నియోజకవర్గ అధ్యక్షులు తిప్పిరి బాలరాజు ను సన్మానించారు. సంఘం గౌరవ అధ్యక్షులు చేపూరి వెంకటేశ్వర్లు, ఎంకే పటేల్ న్యూస్ ఎడిటర్ మాలి కరుణాకర్, ప్రధాన కార్యదర్శి ఆకుల నగేష్, ఉగ్గే శ్రీనివాస్, మోoడా మార్కెట్ కార్పొరేటర్ కొంతం దీపిక, మహిళా అధ్యక్షురాలు చామకూర సుజాత, దువ్వ చంద్రకాంత్, చలిమెల ప్రదీప్ కుమార్, దండు సతీష్, తోట శంకర్, పత్తి అనిల్, కటకం మహేష్, అల్లాడి సాయి, చెలిమెల మహేష్ తో పాటు మహిళలు పిల్లలు వృద్దులు, కుటుంబ సమేతంగా కళ్యాణ మహోత్సవానికి విచ్చేసినారు. కొసమెరుపు_ …… హైదరాబాద్ కాచిగూడ మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం ప్రాగణంలో మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మణికొండ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహాసభకు సంబంధించిన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.రాష్ట్ర సంఘంలో ఇద్దరు అధ్యక్షులు రెండు కార్యక్రమాలు ఒకే ప్రాగణంలో నిర్వహించడం ఇది మున్నూరు కాపులకు అభివృద్ధి కోసం ఏ విధంగా సాంకేతికాలు పోతున్నాయో ప్రజలే తెలియజేయాలి.?