న్యాయం కోసం పోరాడి గెలిచిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

0

 

 

రాజన్న సిరిసిల్ల జిల్లా: నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో, అలాగే ఆదర్శంగా తీర్చి దిద్దాలని వేములవాడ నియోజకవర్గ పరిధి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో నాలుగు సార్లు ఓటమి చవి చూడడం మరొకవైపు అయితే… కూటమి గల కారణాలేటి దానిపైనే పట్టుదలతో పట్టు వీడని విక్రమార్కుడిలా ప్రస్తుత ప్రభుత్వ విప్పుగా బాధ్యతలు స్వీకరిస్తున్న వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే  చేన్నమనేని రమేష్ బాబు పౌరసత్వo పైన  గత దశాబ్ద కాలంగా చేస్తున్న న్యాయపోరాటంలో విజయం సాధించి వీరికి చన్నమనేని రమేష్ బాబు చేత 30 లక్షల ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు,సోమవారం హై కోర్ట్ అడ్వకేట్ లు వి రోహిత్ రావుల సమక్షంలో ఆది శ్రీనివాస్ కు 25 లక్షలు జరిమానా అందజేయడం జరిగింది.హైదారాబాద్ లో హై కోర్టు లో ఆది శ్రీనివాస్ తరుపున వాదనలు వినిపించిన సీనియర్ కౌన్సిల్ వి.రవికిరణ్ రావు,వి.రోహిత్ రావు గత 9 డిసెంబర్ 2024 లో మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు వ్యతిరేకంగా సంచలన తీర్పు ఇచ్చిన హైకోర్టు వీరు భారత పౌరుడు కాదని,జర్మన్ పౌరుడని తేల్చి చెప్పిన  హైకోర్టు. రమేష్ బాబు తప్పుడు పత్రాలతో అధికారులు, న్యాయస్థానాలను 15 ఏళ్ల పాటు తప్పుదోవ పట్టించారని హైకోర్టు ఆగ్రహం చేసింది. పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన హైకోర్టు. రమేష్ బాబు తరపున 30 లక్షల్లో పిటిషనర్ ఆది శ్రీనివాస్ కు 25 లక్షల రూపాయలు, హైకోర్టు లీగల్ సర్విసెస్ కమిటీ కి ఐదు లక్షలు చెల్లించాలని ఆదేశం.జారీ చేసింది. వివరాల్లో కలివెళితే…2009 లో మొదటి సారి వేములవాడ ఎమ్మెల్యేగా విజయం సాధించిన చెన్నమనేని రమేష్ భారత పౌరుడు కాదని గత 15 ఏళ్లు గా న్యాయ పోరాటం చేస్తున్న ఆది శ్రీనివాస్ 2019 లో చెన్నమనేని భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తు నోటిఫికేషన్ ఇచ్చిన కేంద్రం. అనంతరం కేంద్ర నోటిఫికేషన్ పైన హైకోర్టును ఆశ్రయించిన చెన్నమనేని ఈ పిటిషన్ పైన ఐదేళ్ల పాటు విచారణ జరిగిన అనంతరం తీర్పు వెలువరించిన జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి, రమేష్ బాబుకు వ్యతిరేకంగా తీర్పు చెప్పింది. దీంతో హైకోర్టు ఏకంగా కోర్ట్ 30 లక్షలు చెల్లించాలని తీర్పునిచ్చిన ఈ కేసులు చరిత్రలో లేవంటున్న న్యాయ వర్గాలు. వెల్లుబుచ్చాయి. దీంతో ఎటు తేల్చుకోలేని రమేష్ బాబు కోర్టు తీర్పు పైన అప్పీల్ చేయకుండా తప్పు ఒప్పుకుని 30 లక్షల రూపాయలను చెల్లించినారు.తప్పుడు ధ్రువ పత్రాలతో న్యాయస్థానాలను, ప్రభుత్వాలను చెన్నమనేని రమేష్ మోసం చేసాడు.గతంలో హైకోర్టు చెన్నమనేని రమేష్ భారత దేశ పౌరుడు కాదని తీర్పు ఇచ్చింది.హైకోర్టు తీర్పు ప్రకారం  చెన్నమనేని రమేష్ 25 లక్షలు తన న్యాయవాదుల ద్వారా డిమాండ్ డ్రాఫ్ట్ సోమవారం అందించాడు. దీంతోపాటు ఐదు లక్షల లీగల్ సెల్ కు రమేష్ బాబు తరఫున న్యాయవాది అందించడం జరిగినది.ఎమ్మెల్యేగా మోసం చేసి గెలిచినా చెన్నమనేని రమేష్ ఫై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలి.డీజీపీకి ఇచ్చిన ఫిర్యాదులో… చిన్నమనేని రమేష్ బాబు వేములవాడ నియోజక వర్గం ప్రజలకు క్షమాపణ చెప్పాలి,రమేష్ బాబు పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి.గెలుపొందిన 2009 నుండి 2023 వరకు అతను ఎమ్మెల్యే కాదని గెజిట్ నోట్ విడుదల చెయ్యాలి, మాజీ ఎమ్మెల్యే కూడా కాకుండా అతనికి ప్రభుత్వం నుండి ఎలాంటి బెనిఫిట్స్ రాకుండా చూడాలనీ తెలిపారు.ఈ కేసును వాదించిన సీనియర్ కౌన్సిల్ వి. రవి కిరణ్ రావు, రోహిత్ రావు లకు ధన్యవాదములు ఆది శ్రీనివాస్ తెలిపారు. దీంతో నియోజకవర్గ ప్రజలు, ఆది శ్రీనివాస్ అభిమానులు చాలా సంతోషంగా, ఉత్సాహంతో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *