హైదరాబాద్: మున్నూరుకాపులు ఆర్థికంగా రాజకీయంగా ముందుకు సాగినప్పుడే వారికి మనుగడ ఉంటుందని దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సి అన్నపూర్ణ పటేల్ పిలుపునిచ్చారు.ఆదివారం మున్నూరు కాపు సంక్షేమ సంఘం దిల్షుక్నగర్ ఎల్బీనగర్ వారి సౌజన్యంతో కొత్తపేట కిలా మైసమ్మ దేవస్థానంలో మున్నూరు కాపు బోనాల ఉత్సవాలను పాల్గొని ప్రసంగించారు. గత 38 సంవత్సరంలో వివిధ దేవదాయ శాఖలో పనిచేయడంలో నాకు ఆ దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తూ మా కుటుంబ సభ్యులు నన్ను ఆదరించి,అభిమానించి ఈ స్థాయిలో నింపినందుకు వారికి సభాముఖంగా ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. మున్నూరుకాపు మహిళా పటేల్ అన్ని రంగాలలో ముందుకు వెళ్లాలని ఆర్థికంగా వివిధ రంగాలలో ముందుకు వెళ్లాలని మహిళలకు అన్నపూర్ణ సూచించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు బండి పద్మ మాట్లాడుతూ మున్నూరు కాపులు మహిళలు ముఖ్యంగా ఆర్థికంగాతో పాటు రాజకీయ శక్తిగా ఎదిగినప్పుడు ఆ కుటుంబం సామాజిక వర్గం ముందుకు వెళుతుందని దానికోసం ప్రతి ఒక్కరు ఒక సంకల్పంతో ముందుకు సాగాలని బండి పద్మ సూచించారు. బీసీలలో మున్నూరు కాపులు రాజకీయంగా ముందుకు సాగాలని రెడ్డి ,వెలమ లాంటి కులాలు రాజకీయ అధికారంలో వస్తున్నారని తెలియజేశారు.