మున్నూరుకాపులు పార్టీలకతీతంగా ఉండాలని.. రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ పుటం
సూర్యాపేట జిల్లా: మున్నూరుకాపు కులస్తులంత రాజకీయలకు అతీతంగా,ఐక్యంగా ఉండి మున్నూరుకాపు సామాజిక వర్గానికి గుర్తింపు తేవాలని రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ పుటం పురుషోత్తమ రావు పటేల్ తెలిపారు. డిసెంబర్ 19 శుక్రవారం రోజున నూతనంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై కోదాడకు ప్రథమగా విచ్చేసిన సందర్భంగా స్థానిక మున్నూరు కాపు సంఘం నాయకులు ఆయనను అభినందిస్తూ శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా సర్దార్ మాట్లాడుతూ కాపు కులస్తులు ఎవరు ఏ పార్టీలో ఉన్నా కూడా వారిని మున్నూరు కాపు కులస్తులు ఆదరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పొట్ట.జగన్మోహన్ రావు,రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆవుల రామారావు, కార్యదర్శి ఇందూరి తిరుపతి పటేల్,నాయకులు పాలేటి రామారావు,మాజీ జెడ్పిటిసి కోలా ఉపేందర్, మాజీ ఎంపీపీ బండ్ల కోటయ్య, సన్నీరు మురళి, పోరా వెంకటేశ్వర్లు, కస్తూరి రాములు, ఆవుల రంగారావు, పసుపులేటి నరసింహారావు, వీరాంజనేయులు,పొట్ట కిరణ్, భూతం రవి తదితరులు పాల్గొన్నారు.
