మున్నూరు కాపు మహిళ భవన నిర్మాణానికి స్థలం విరాళంగా అందించిన గజ్జల కుటుంబీకులు

వరంగల్ జిల్లా: వరంగల్ తూర్పు నియోజకవర్గం స్థానిక కిలా వరంగల్ వాస్తవ్యులు ప్రముఖ వ్యవసాయ మార్కెట్ ఆర్తి అండ్ కమిషన్ వ్యాపారస్తులు స్వర్గీయ గజ్జెల ఆగమ్మ-పాపయ్య దంపతుల జ్ఞాపకార్ఢంగా వారి కుమారులైన స్థానిక మార్కెట్ వ్యాపారవేత్తలు గజ్జెల రామనాథం,సత్యనారాయణ,రమేష్ బాబు సోదరులు జన్మించిన గడ్డ ఖిలావరంగల్ పడమర కోటలోని వారికి ఉన్నటువంటి ఐదు వందల గజాల ఖాళీ స్థలమును మున్నూరుకాపు మహిళ కమ్యూనిటీ భవన నిర్మాణం కొరకు విరాళంగా దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండ సురేఖకు అందించారు.మున్నూరుకాపు ఖిలావరంగల్ ప్రజల అభ్యర్థన కొరకు ఉచితంగా ఇచ్చినారు.ఇట్టి స్థలములో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ,అటవీ శాఖ మంత్రివర్యులు తూర్పు నియోజకవర్గ శాసన సభ్యురాలు శ్రీమతి కొండా సురేఖ ప్రభుత్వం నుండి కోటి ఇరవై మూడు లక్షల రూపాయలు కమ్యూనిటీ హాల్ గ్రౌండ్ మొదట అంతస్తును నిర్మించుట కోసం ఏర్పాటు చేస్తామని తెలుపుతూ శుక్రవారం ప్రారంభోత్సవం చేసారు.ఈ కార్యక్రమంలో,స్థల దాతలు స్వర్గీయ గజ్జల ఆగమ్మ, పాపయ్య మనుమడు గజ్జెల రామకృష్ణ ,గజ్జెల.సాయిప్రణయ్ మంత్రి అభినందిస్తూ వారి చేతుల మీదుగా శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో వరంగల్ మున్సిపల్ నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి,కమిషనర్, స్థానిక కార్పొరేటర్ తదితరులు పాల్గొన్నారు. ఉదర స్వభావాన్ని చాటింపు చేసిన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన గజ్జల కుటుంబీకులకు జిల్లా మున్నూరు కాపు సంఘం అభినందనలు తెలియజేశారు.ఇలాగే మన సామాజిక వర్గానికి ఆర్థికంగా స్థిరపడిన దాతలు ముందుకు వచ్చి ఇలాంటి భవన నిర్మాణానికి తమ వంతు సహకారాన్ని అందించాలని జిల్లా సంఘం కోరారు.
