దిల్ సుఖ్ నగర్ మున్నూరుకాపు సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

0

హైదరాబాద్:  దిల్ సుఖ్ నగర్ -ఎల్.బి.నగర్ మున్నూరుకాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో  సాయంత్రం 2026 క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్నూరుకాపు సంఘం తెలంగాణ రాష్ట్రం అధ్యక్షుడు సర్దార్ పుటం పురుషోత్తం పటేల్ మాట్లాడుతూ కులమే బలం.కులస్తులతోనే ఏదైనా సాధ్యమవుతుందన్నారు. కుల ఐక్యతే సంక్షేమ కార్యక్రమాలకు తొలిమెట్టు అన్నారు.మున్నూరుకాపులందరి బాగుకోసమే ఆలోచించి పది ఏళ్ల క్రితం దిల్ సుఖ్ నగర్ – ఎల్.బి.నగర్ మున్నూరుకాపు సంక్షేమ సంఘం ఏర్పాటు చేశామని,తమ లక్ష్యం నెరవేరిందన్నారు. గత పదేండ్లుగా సంఘం ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా క్యాలెండర్ ను ఆవిష్కరిస్తున్నారని అభినందించారు.టీపీసీసీ కార్యదర్శి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, సంఘం గౌరవ సలహాదారు కోట్ల శ్రీనివాస్ పటేల్ మాట్లాడుతూ.అగ్రకులాల్లోని నాయకులు బీసీ కులాల్లోని మున్నూరుకాపులు,గౌడన్నలు,యాదవుల మధ్య విభేధాలు సృష్టిస్తూ, మనలో మనకే గొడవలు పెడుతూ,బీసీలను తొక్కేస్తూ,అగ్రవర్ణాల వాళ్లు రాజ్యమేలుతున్నారని అన్నారు.ఈ ప్రాంతం మున్నూరుకాపుల అడ్డా అనీ,1989లో పుంజాల సుధీర్ కుమార్ ను గెలిపించింది మున్నూరుకాపులే అనీ గుర్తు చేశారు. మున్నూరుకాపులు తలుచుకుంటే మళ్లీ అలాంటి రోజులు వస్తాయని,పునర్విభజనలో సీట్లు పెరుగుతాయని, మన జాతి తలుచుకుంటే మున్నూరు కాపులే ఎమ్మెల్యే అవుతారని అన్నారు. అలాగే, రాబోయే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇప్పించడానికి, నామినేటెడ్ పోస్టుల్లో మన మున్నూరుకాపుల పక్షాన కొట్లాడి పదవులు ఇప్పించడానికి ముందుండి పని చేస్తానని హామీ ఇచ్చారు.సంఘం అధ్యక్షుడు అనంతుల నవీన్ పటేల్ మాట్లాడుతూ..పదేండ్ల క్రితం 150 మందితో ప్రారంభమైన సంఘం ఈరోజు రెండు వేల మంది పాల్గొనే స్థాయికి రావడం గొప్ప విషయమన్నారు.గౌరవ సలహాదారు త్రివేది మాట్లాడుతూ సంఘం ఆధ్వర్యంలో ఉగాది పంచాగం వేడుకలు, ఖిల్లా మైసమ్మ బోనాలు,శ్రీ సీతారాముల కల్యాణం,క్యాలెండర్ ఆవిష్కరణ క్రమం తప్పకుండా జరపడం గొప్ప విషయమన్నారు.సంఘం ముఖ్య నాయకులు ఆరె క్రాంతి పటేల్ మాట్లాడుతూ.ఇంతకాలం అగ్రవర్ణాల పల్లకీ మోసిన బీసీలు మన ఓట్లు మనమే వేసుకొని రాజ్యం ఏలుకొనే రోజులు వచ్చాయన్నారు.ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు తోట రాజు పటేల్,ప్రధాన కార్యదర్శి చక్రం నాగరాజు పటేల్, కోశాధికారి అక్కెనపల్లి వేణుగోపాల్,సంఘం నాయకులు ఆవుల రామారావు పటేల్, ఎక్కా రమేశ్ పటేల్,మామిడి అశోక్ పటేల్,మంత్రి రాజు పటేల్, సీనియర్ జర్నలిస్టు గోపాల బాలరాజు పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *