మున్నూరు కాపు నూతన డైరీ ఆవిష్కరణ చేసిన-కే కేశవరావు
హైదరాబాద్: తెలంగాణలో బీసీ బహుజనులకు గత ఎనిమిది వసంతాలుగా రాజ్యాధికారం పొందలేకపోతున్నారని అందుకోసం బీసీలు బహుజనులు అందరూ ఒక్కటై పోరాడితేనే బహుజన రాజ్యం సాధ్యపడుతుందని మాజీ పార్లమెంట్ సభ్యులు తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు కంచర్ల కేశవరావు అన్నారు,ఆదివారం సికింద్రాబాద్ రాజరాజేశ్వరి గార్డెన్లో మున్నూరు కాపు సంఘం తెలంగాణ నిర్వహించిన సర్పంచ్ ల సన్మానం,నూతన 2026 డైరీ ఆవిష్కరణ చేసిన అనంతరం సభలో ఆయన మాట్లాడారు,మున్నూరు కాపులు ముందుండి అన్ని కులాలను కలుపుకొని రాజ్యాధికారం దిశగా పయనించాలని సూచించారు, ఎన్నికైన నూతన సర్పంచులు చట్టసభల వరకు పార్టీలకతీతంగా ఎదగాలని ఎంపీటీసీ, జడ్పిటిసి మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో మున్నూరు కాపులు గెలిపించేందుకు సర్పంచ్లు కృషి చేయాలని మాజీ ఎంపీ వి హనుమంతరావు సూచించారు, గత ప్రభుత్వం మున్నూరు కాపులకు కోకాపేటలో కేటాయించిన ఐదు ఎకరాల స్థలానికి ప్రభుత్వం నుండి15 కోట్లు కేటాయించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి దృష్టికి తెలియజేస్తానని మాజీ మంత్రి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. మున్నూరు కాపులు కష్టజీవులని,తమ హక్కుల కోసం ఎవరి మీదనైనా పోరాటం చేస్తారని పేర్కొన్నారు.కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రివర్యులు మంగపతి పల్లం రాజు మాట్లాడుతూ మున్నూరు కాపులు నీతి నిజాయితీతో బ్రతుకే కష్టజీవులు వారేనని కేంద్ర మాజీ మంత్రి మంగపతిపాలెం రాజు అన్నారు. ఒకవేళ వారు తెగిస్తే ఎంతవరకైనా పోరాడతారన్నారు, ఇప్పటికీ కూడా రాజ్యాధికారం దక్కకపోవడంలో మనలోని అనైక్యత కారణం అన్నారు. పల్లం రాజు అన్నారు. కరీంనగర్ పట్టుభద్రుల ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య మాట్లాడుతూ మున్నూరు కాపులు రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలన్నారు ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టి నందుకు కమిటీ సభ్యులను అభినందించారు, మాజీ జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీరమల్ల ప్రకాష్, పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుద్ర సంతోష్, తొలి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి పిఆర్ఓ,హజారి రమేష్ రాష్ట అధ్యక్షులు పుట్టం పురుషోత్తం రావు, డైరీ కమిటీ చైర్మన్ మంగళారపు,లక్ష్మణ్,అల్లం భాస్కర్, కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్, కరీంనగర్ లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్, మార్క్ ఫేడ్ మాజీ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి బిజెపి నాయకులు బుక్క వేణుగోపాల్,ఈసంపల్లి వెంకన్న, సంగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్ది పెంటయ్య, కోశాధికారి కంచి సత్యనారాయణ, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బండి పద్మ, డైరీ కమిటీ సభ్యులు ఆకుల సత్యనారాయణ కోలా శివకుమార్,పర్వత సతీష్, వివిధ జిల్లాల నుంచి అధ్యక్షులు,మహిళా సోదరీమణులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన మున్నూరు కాపు సర్పంచులకు సన్మానం చేశారు.
