తిరుమలను దర్శించుకున్న కమ్యూనిస్టు యోధుడు నారాయణ
ఆంధ్ర ప్రదేశ్: దశాబ్దాల పాటు “దేవుడు లేడు” అని తాను నమ్మిన సిద్ధాంతం నుంచి, వయసు మళ్ళిన తర్వాత “అంతా ఆ దేవుడే చూసుకుంటాడు” అనే ఆధ్యాత్మిక బాటలోకి రావడం ఒక గొప్ప జ్ఞానోదయం ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు సీపీఐ నారాయణ (చికెన్ నారాయణ) శ్రీవారిని దర్శించుకుని ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయడం శుభపరిణామం.మార్క్సిస్ట్ గ్రంథాలు ఎంత చదివినా దొరకని ప్రశాంతత,ఆ వేంకటేశ్వరుడి పాదాల చెంత దొరుకుతుందని ఆయన గ్రహించడం సంతోషకరం.ఎర్రజెండా నీడలో ఎన్ని విప్లవాలు చేసినా,ఆఖరి మజిలీలో ఆ కాషాయపు వెలుగు,ఆధ్యాత్మిక శాంతి అవసరమని అర్థమైంది.నాస్తికత్వం అనేది కేవలం యవ్వనపు ఆవేశం మాత్రమేనని తెలుసుకున్నాడు.వయసు పెరిగే కొద్దీ ఆ పరమాత్ముని ఉనికిని కాదనలేమని ఈ దర్శనం నిదర్శనంగా నిరూపిస్తోంది.ఇది రాజకీయ మలుపు కాదు.. ఆత్మ కనుగొన్న సత్యం గతంలో 1970 ప్రాంతంలో తన రచనలతో సాంప్రదాయాలకు పాతర వేసిన ప్రముఖ సంచలన రచయిత గుడిపాటి చలం కూడా అతిపెద్ద నాస్తికుడే.తన జీవిత చరమాంకంలో అరుణాచలం లో లార్డ్ శివయ్య నిధిలో గడిపాడు.అదే విధంగా గద్దర్,ఎన్.ప్రసాద్ రావు, శ్రీశ్రీ,రాహుల్ సాంకృత్యాయన్ వంటి దిగ్గజాలు కూడా ఇదే బాటలో పయనించారు.అంటే ఎంతటి కరుడుగట్టిన విప్లవకారుడైనా,ఆఖరికి సత్యం వైపు,వాస్తవం వైపు,భక్తి వైపు రావాల్సిందే అన్న నిజం మరో సారి నిరూపితం అయింది. మనిషి తన మనసులో భక్తి భావం పెంచుకోవడం వల్ల ఇతరులతో సత్సంబంధాలు మెరుగుపడతాయని తెలుస్తుంది.
