కేంద్రమంత్రికి బండి సంజయ్ కి మున్నూరుకాపు సంఘం సత్కారం

0

నిత్యం ప్రజల సమస్య పోరాటం, ప్రజలే తనకు బంధ వర్గాలు, మామూలు కార్యకర్తగా భారతీయ జనతా పార్టీలో చిన్నతనంలోనే ఆర్ఎస్ఎస్ భావాలను అవలింప చేసుకొని, కరీంనగర్ జిల్లాలోని కాపువాడ డివిజన్ కార్పొరేటర్ గా గెలుపొంది, కరీంనగర్ అర్బన్ బ్యాంకుకు డైరెక్టర్ గా ఎన్నికై తన రాజకీయ ప్రస్థానాన్ని అరగెట్రం చేశారు. మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన యువ నాయకుడు బండి సంజయ్ వీరు రెండు తెలుగు రాష్ట్రాలలో తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని అతి త్వరలోనే ఏర్పాటు చేసుకొని, ఎందరో తెలుగు ప్రజల మన్నలను పొందిన వీరు రెండోసారి కరీంనగర్ ఎంపీగా ఎన్నికై భారత ప్రధాని నరేంద్ర మోడీ నుండి శభాష్ బండి అనిపించుకున్న మహోన్నతమైన వ్యక్తి, వీరు కేంద్ర మంత్రివర్గంలో కేంద్ర హోమ్ మంత్రి గా బాధ్యతలు చేపట్టిన తరుణంలో సంజయ్ కు  తమ సామాజిక వర్గం తరపున కాపువాడ లో రేపు ఆదివారం మున్నూరుకాపు ఆత్మీయ సమ్మేళనంలో వారికి, వారి కుటుంబానికి ఆత్మీయ సన్మానం ఏర్పాటు చేయడం జరిగినది. నేడు మున్నూరుకాపు అంటే అది కేవలం బండి సంజయ్ ద్వారానే గుర్తింపు వచ్చిందని తెలంగాణ మున్నూరుకాపు ప్రజలు నేడు గర్వంగా చెప్పుకోగలుగుతున్నారు. ఇంతే కాకుండా వీరికి తమ సామాజిక వర్గం అంటూ యావత్తు భారతదేశంలో ఉన్న కాపు, అనుబంధ కాపులు, ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఆత్మీయ అభిమానానికి తెలంగాణలో ఉన్న మున్నూరు కాపులు అందరూ అభిమానులు ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా కాపువాడ మున్నూరుకాపు సంఘం నాయకులు తెలియజేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *