తెలంగాణ ఔట్సోర్స్ ఉద్యోగులతో ఎంపీ ఈటెల సమావేశం

0

తెలంగాణ, హైదరాబాద్ :తెలంగాణ  రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ డిమాండ్లపై ఏర్పాటు చేసిన రౌండ్ టెంపుల్ సమావేశంలో పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్. హైదరాబాద్ సోమాజిగూడలో శనివారం జరిగిన  సమావేశంలో ఆయన మాట్లాడుతూ.కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, వారి సమస్యల పై ఐదు సంవత్సరాలుగా నేను కూడా మీలాగే కొట్లాడుతున్నాను. ఆర్థిక మంత్రి కాకముందు మాకు ఇంత అవగాహన లేకుండే..ఆర్థిక మంత్రిగా కాంట్రాక్టు ఉద్యోగులకు కొంచెం స్కేల్ పెంచి వారిని గుర్తించినప్పటికీ.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం అది జరగలేదు. ఆయా డిపార్ట్మెంట్ వారే ఒక ఏజెన్సీ ఏర్పాటు చేసుకుని కమిషన్ లేకుండా ప్రభుత్వం ఎంత ఇస్తే అంత ఇవ్వమని చెప్పాము.అడ్డ మీద కూలీలకు 600 నుంచి 800 కూలి వస్తుంది,చదువుకున్న ఉద్యోగులకు మాత్రం 400 రూపాయలు వచ్చేవి దాన్ని సవరించాలని ఆరోజు మేము ప్రయత్నం చేశాం.మేము వచ్చాక మొదటి PRC లో పెంచే ప్రయత్నం చేశాం. చదువుకున్న మనుషులకు వచ్చే జీతాల కంటే అడ్డ మీద కూలీలకు ఎక్కువ జీతం ఉండే పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి వీళ్ళకి కొంత గౌరవప్రదమైన వేతనం ఉండాలని చూశాం.మొత్తం సిస్టంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు చేసే అంత వెట్టి చాకిరి ప్రభుత్వ ఉద్యోగులు కూడా చేయరు. ఉద్యోగులకు ఏ చిన్న సమస్య వచ్చినా పెన్ డౌన్ లు, సమ్మెలు చేసే ఆస్కారం ఉంటది, కానీ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ కి సమ్మెలు చేసే ఆస్కారం లేదు.ఎవరు కన్నెర్ర చేసిన ఉద్యోగం పోతది అనే భయంతో వాళ్లు జిమ్మెదారుతనంతో, బాధ్యతతో పని చేసే విధానాన్ని నేను చూశాను.ఎన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ ఒక ఔట్సోర్సింగ్ ఉద్యోగి జీవితంలో ఒక ఇల్లు కట్టుకోలేడు, పిల్లలకి లక్షల డొనేషన్ కట్టి చదివించే ఆస్కారం లేదు.ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను BPL కింద జమ చేసి వీళ్ళకి కూడా ఇల్లు, హెల్త్ కార్డులు, రేషన్ కార్డులు ఇవ్వాలి అని ప్రయత్నం చేశాం కానీ అది కాలేదు.ఆనాడు 1650 రూపాయల జీతంతో కంటింజెంట్ ఎంప్లాయిస్ ఉండేవారు. వారు 25-30 ఏళ్లు సర్వీస్ నుండి రిటర్న్ అయిపోతే మరణిస్తే ఐదు పైసలు బిల్లా కూడా రాలేదు వాళ్లకి.వారందరి గురించి నా తాపత్రయం కొనసాగుతుందని ఎంపీ రాజేందర్ తెలియజేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *