భారత కుబేరుడు అంబానీ ఇంట్లో జరిగిన వివాహంతో ఆషాఢం గుట్టురట్టు
ఆషాఢం లేదు,గీశాడం లేదు,ఎప్పుడైనా పెళ్లి చేసుకోవచ్చు.ఆషాఢ మాసాన అల్లుడూ అత్తా ఒక వాకిట్లో తిరగకూడదట.అందుకని ఈ నెలలో ముహుర్తాలు లేవని పెళ్లి చెయ్యరు.ఈముహుర్తాలన్నీ పురోహితులు సృష్టించినవే, ఉదాహరణకు నిన్న బొంబాయిలో జరిగిన భారత కుబేరుడు అంబానీ కుటుంబంలో జరిగిన వివాహంతో బట్టబయలైంది.అసలు ముహుర్తాలు మోసం ,ఇందంత పురోహితుల పొట్టకూటి కోసం తప్ప,ముహూర్తంలో ఎలాంటి బలం లేదని గత 2500 సంవత్సరాల క్రితమే చార్వాకులు ఎలుగెత్తి చాటారు. ఇట్టి దానిని తుంగలో తొక్కారు.నాలుగు వందల సంవత్సరాల క్రితం ప్రజాకవి వేమన కూడా ముహుర్తాల,గురించి ఉతికి ఆరేశాడు.అదే బాటలో సంస్కరణ వాదులు పెరియార్, త్రిపురనేని,గొర లాంటివారు ప్రజలను చైతన్య పరిచారు.ఆధునిక విజ్ఞానం ఈ ముహుర్తాలను,గ్రహబలాలను కొట్టిపారేస్తుంది.జాతకాలు, నక్షత్ర బలం అన్నియు కూడా బూటకం అని చెప్తుంది.వివాహానికి కావలసింది ముహూర్తం,లగ్నం,పెళ్లి మంత్రాలు, జాతకాలు కాదు. యువతి, యువకులకు ఒకరి మీద ఒకరికి ప్రేమ, నమ్మకం, ఆప్యాయత తప్ప భాజామేళాలు,పెళ్లి మంత్రాల పేరుతో బూతులు కావు అని ఈరోజు జరిగే ఆదర్శ వివాహాలు రుజువు చేస్తున్నాయి.అందరికీ గుర్తు వచ్చేది సీతారాముల వివాహం. ఉదాహరణకి సీతారాముల వివాహానికి వసిష్ఠుడు పెట్టి ముహూర్త బలం ఏమయింది? భార్యాభర్తలు అడవులపాలు.సీత రాముని చేత అవమానాలు. చివరికి సీత భూదేవిలో కలసిపోవటం,రాముడు సరయూనదిలో మునిగిపోవటం.(ఆత్మహత్య)ముహుర్తాలలో ఏమాత్రం బలం లేదని ఏనాడో తేలిపోయింది. అబ్బాయి, అమ్మాయిలు ఒకరి కొకరు ఇష్టపడితే,ఇద్దరి ఫోటోలు, పుట్టినతేదీలు,ఇద్దరు పెద్దమనుషులు తో రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి స్పెషల్ మ్యారేజ్ ఆక్ట్ 1954 క్రింద రిజిస్టర్ చేసుకుంటే,30 రోజుల తరువాత రిజిష్ట్రార్ ఆఫీస్ లో పెళ్లి అయినట్లు సర్టిఫికెట్ ఇస్తాడు. కేవలం 50 రూపాయలు రుసుము ఉంటుంది. అంటే 50 రూపాయలతో వివాహం చేసుకోవచ్చు. ఇప్పటికైనా వధూవరుల విషయంలో వారి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *