మన క్రొత్త వందరూపాయల నోటుపై వెనుక ఉన్న బొమ్మని గమనించారా

0

ఇండియాలో చలామణి అవుతున్న క్రొత్త వంద రూపాయల నోటుకు వెనుక వైపు ఉన్న ఈ చిత్రం పేరు “రాణీకావావ్”.ఇది ఒక నీటిబావి, ఇది గుజరాత్ లోని పఠాన్ జిల్లాలో ఉంది.మన వంద రూపాయల నోటు మీదకు వచ్చేవరకు ఎవరికీ తెలియని ఈఅద్భుత నిర్మాణం విశేషాలు..మాములుగా దేశంలో ఉన్న చాలా నిర్మాణాలు రాజులు దేవుళ్ల కోసమో తమ రాణుల కోసమో కట్టించారు.కానీ దీన్ని మాత్రం సోలంకి వంశానికి చెందినరాణి ఉదయమతి తన భర్త భీమ-1 గుర్తుగా1050-1100 మధ్య సరస్వతి నది ఒడ్డున నిర్మించింది. మొత్తం ఏడు అంతస్థుల్లో నిర్మించిన ఈ బావి పొడవు దాదాపు 213 అడుగులు. వెడల్పు 66 అడుగులు, లోతు 92 అడుగులు. భారతదేశంలో మిగిలిన నిర్మాణాలన్ని నేల మీద నుండి పైకి అంతస్థులుగా నిర్మిస్తే దీన్ని మాత్రం భూమి లోపలికి 7 అంతస్థులుగా నిర్మించడం విశేషం. భూమి లోపలికి తవ్వుతూ నిర్మాణాలు చేయడం ఎంతో కష్టమైనప్పటికి ఈ నిర్మాణం భారతీయుల ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఓ అద్భుత ఉదాహరణ.ఈ నిర్మాణంలో అద్భుత కథలు చెక్కిన 215 స్థంభాలు, దాదాపు 800 శిల్పాలు ఉన్నాయి. గోడల మీద దశావతారం కథలు, ఇతర పురాణాలు, స్త్రీల గురించి ఎన్నో బొమ్మలు చెక్కబడ్డాయి.ఈబావి మరోఅద్భుతం లోపలికి దిగిన కొద్ది ఉష్ణోగ్రత తగ్గి,చల్లగాఉంటుంది. 7 అంతస్తులు దిగిన తరువాత బావి ఉంటుంది.అప్పట్లో బావిచుట్టూ ఔషధ మొక్కలు కూడా పెంచారు అందుకే ఈబావిలో స్నానం చేస్తే రోగాలు తగ్గేవి.బావి దగ్గరే ఓ తలుపు మూయబడి ఉంటుంది. అప్పట్లో శత్రువులు దాడి చేసినపుడు ఆ తలుపు తెరిచి లోపల 30 కిలోమీటర్ల పొడవు ఉన్న సొరంగ మార్గంలో సిద్దాపూర్ అనే పట్టణానికి చేరే ఏర్పాటు చేశారు.కానీ ఒకసారి సరస్వతి నదికి వచ్చిన వరదల్లో ఈబావి పూర్తిగా ఇసుకలో కూరుకుపోయింది.1980 లో ఆర్కీలాజికల్ల్ స్ సర్వే ఆఫ్ ఇండియా జరిపిన తవ్వకాల్లో ఇది బయటపడింది.2014లో యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ సంపద జాబితాలోకి చేర్చి దీని కీర్తి విశ్వవ్యాప్తం చేసింది. కానీ2018 జులైలో రిజర్వ్ బ్యాంకు 100 రూపాయల నోటు మీద ముద్రించే వరకు చాలామంది భారతీయులకు ఈఅద్భుత నిర్మాణం గురించి తెలియక పోవడం బాధాకరం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *