కాంగ్రెస్ కండువా కప్పుకున్న గాలి అనిల్ కుమార్
హైదరాబాద్: బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పటాన్చెరువు కు చెందిన గాలి అనిల్ కుమార్ ఈరోజు సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరినారు.బి ఆర్ఎస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైనారు, వీరితోపాటు పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, మీరు అనుచరులు, నాయకులు తిరిగి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సమక్షంలో కండువా కప్పుకున్నారు. అనిల్ కుమార్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ లోనే కొనసాగారు,కాంగ్రెస్ పార్టీ నుండి నర్సాపూర్ నియోజకవర్గం పార్టీ తరపున టికెట్టు ఆశించారు.కానీ ఫలితం లేకపోవడంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరినారు,వీరికి ఆపార్టీ సరైన గుర్తింపు ఇచ్చి తమ పార్టీ తరఫున ఎంపీగా ఎన్నికై చేయడం జరిగినది.