దర్శనం కోసం రోడ్డుపైన బేటాయించిన భక్తులు

0

 

శ్రీశైలం: తొలి ఏకాదశి పండుగ సందర్భంగా లొద్దిలో వెలసిన మల్లయ్య స్వామిని దర్శించుకోవడానికి హైదరాబాదు నుండి భక్తులు బయలుదేరినారు.రెండు రోజుల క్రితం అనుమతినిచ్చిన ఫారెస్ట్ అధికారులు బుధవారం  శ్రీశైలం రోడ్డు ద్వారా లొద్దికి వెళ్లే మార్గంలో భక్తులను ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడంతో హైందవ సంఘాలు అగ్రహించి రహదారిపైన ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలలో రాష్ట్ర బీజేపీ కౌన్సిల్ సభ్యులు మండికారి బాలాజీ,బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి నాగరాజుల ఆధ్వర్యంలో పెద్ద నినాదాలు చేస్తూ రహదారిపై బైటాయించారు. అంతేగాక రెండు రోజుల క్రితం డిఎఫ్ ఓ ఆపినారు. హైందవ సంఘాలకు  ఫోన్లో స్థానిక ఎమ్మెల్యే ఇచ్చిన అనుమతి బేఖాతర్ చేస్తూ భక్తులను అడ్డుకున్నారు. దీనితో అధికారులు డి.ఎఫ్.ఓ తో  స్థానిక ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడిన తరువాత అనుమతి నివ్వడంతో హిందూ సంఘాలు లొద్ది మల్లన్న సందర్శనానికి బయలు దేరారు. బీజేపీ నేతలు మండికారి బాలాజీ గంగిశెట్టి నాగరాజులు మాట్లాడుతూ హిందువుల మనోభావాలతో ఇలా ఆటలాడుకోవటమేమిటని మండిపడ్డారు. అనుమతులిచ్చి మరోవైపు సిబ్బందితో అడ్డుకోవడమేమిటని ప్రశ్నించారు. కేవలం హిందూ వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇంకెప్పుడు కూడా హిందువులను ఇలా ఇబ్బందులకు గురి చేయవద్దని డిమాండ్ చేశారు. పవిత్రమైన ఏకాదశి పండుగ రోజున దేవుడిని దర్శించుకోవాలంటే ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని వాపోయారు. దాదాపు పదివేల మందిని భక్తులు ప్రతిమలను దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీనునాయక్ నోముల శంకర్ గౌడ్ ,రాము,నవీన్ ,నరేష్ తో పాటు చాలామంది హిందువులు పాల్గొనడం జరిగింది.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *