విప్ ఆది శ్రీనివాస్ ను సన్మానించిన మున్నూరుకాపులు
సిరిసిల్ల జిల్లా: గంభీరావుపేట మండల కేంద్రంలోని శనివారం గాయత్రి ఫంక్షన్ హాల్ లో జరిగిన మండల మున్నూరుకాపు ఆధ్వర్యంలో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను ఘనంగా సన్మానిచ్చారు ఈ కార్యక్రమంలో గంభీరావుపేట మండల మున్నూరుకాపు కుల బాంధవులు జిల్లా కార్యవర్గ సభ్యులు హాజరైనారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కూడా విచ్చేసిన.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో మున్నూరుకాపు ఐక్యతకు వారి అభివృద్ధికి మున్నూరుకాపు యువత పై చదువులకు గాని ఇతర ఏ అవసరం ఉన్న వారి కోసం తోడ్పడుతానని తెలియజేశారు.వారి వెంట మున్నూరుకాపు జిల్లా అధ్యక్షులు బొప్పా దేవయ్య జిల్లా కార్యవర్గ సభ్యులు మండల మున్నూరు కాపు నాయకులు సిరిసిల్ల పట్టణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గడ్డం నర్సయ్య సిరిసిల్ల పట్టణ హడక్ కమిటీ కన్వీనర్ అగ్గి రాములు,జిల్లా మాజీ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ వివిధ మండలాల అధ్యక్షులు కార్యదర్శులు, గ్రామ అధ్యక్షులు,కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.