మున్నూరుకాపు పటేల్స్ ఫార్మా ప్రతినిధుల సమావేశం

0

కరీంనగర్ జిల్లా ; తెలంగాణలో ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 300 మంది మున్నూరుకాపు పటేల్స్ వివిధ కంపెనీ ఫార్మా మార్కెటింగ్ రంగంలో మేనేజర్లు, ప్రతినిధులు,వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్నారు.కీలకమైన ఫార్మా రంగంలో ఎంతో పని ఒత్తిడిలో విధులు నిర్వహిస్తున్న పటేల్స్ మధ్య సంబంధబాంధవ్యాలు పెంచడంతో పాటు పరస్పరం సహకారాలతో  ఉండాలని దృక్పథంతో ఆదివారం కరీంనగర్ పట్టణంలో జరిగిన సమావేశంలో పటేల్ ఫార్మా అసోసియేషన్  ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు నూటా యాభై మంది సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో తాము ఎదుర్కొంటున్న పలు అంశాలను చర్చించి వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని నిర్ణయించారు. అనంతరం ఈ సమావేశానికి హాజరైన సభ్యుల సమక్షంలో తాత్కాలిక కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.గౌరవ అధ్యక్షులుగా జక్కుల చంద్ర ప్రకాశ్ (P&G) కాముని రాజేశ్వర్(Alembic) ముఖ్య సలహాదారులుగా,కుడుదుల సంజీవరావు(Jagath Pharma) గుండ సతీష్ (Fusion) అధ్యక్షులుగా, జారతి శ్రీకర్(Medmanor) ఉపాధ్యక్షులుగా,జారతి మదన్ మోహన్ (Aurobindo) పోకల రవీందర్ (Sun),ప్రధాన కార్యదర్శిగా,నామ రమేష్ (Gripkrem) సహాయ కార్యదర్శిలుగా,రాయికంటి కిరణ్ (Aristo),తాడేపు శ్రీనివాస్ (Macleodes),కోశాధికారిగా,జవ్వాజి శ్యామ్ ప్రసాద్ (Axa),ఉప కోశాదికారిగా,సైండ్ల మహేందర్ (Samarth),కార్యవర్గ సభ్యులుగా తదితరులను ప్రకటించినారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *