తెలంగాణ పంచాయతీ ఎలక్షన్ల ఖరారు అయినట్లే
హైదరాబాద్:- తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మోగనున్న ఎన్నికల నగారా! గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం….. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి శుక్రవారం సీఎం అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇప్పటికే సర్పంచ్ ల పదవీకాలం ముగిసి ఆరు నెలలు కావొస్తుందన్నారు.ఈ నేపథ్యంలో రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు లేకుండా గత రిజర్వేషన్లలే కొనసాగించాలని అధికారులకు సూచించారు.ఆగస్టు నెలలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు.ఈ సమావేశంలో మంత్రులు అధికారులు పాల్గొన్నారు.