చెత్త కుప్పలలో మహానగరం, నిద్ర మత్తులో ప్రభుత్వం
తెలంగాణ : హైదరాబాద్ నగరంలో ఎక్కడా చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి.సుమారు వేయి స్వచ్ఛ ఆటోలు పనిచేయడం లేదు.బస్తీలు,కాలనీల్లో వ్యర్థాలు పేరుకుపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయిని మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ ఎక్సెల్ లో పేర్కొన్నారు.డెంగీ, మలేరియా,అతిసారం వంటి సీజనల్ వ్యాధులతో ప్రజలు అవస్థలుపడుతున్నారు.చెత్త తరలింపు కేవలం కాగితాల్లో మాత్రమే కనిపిస్తున్నది. వీటి పైన మహానగర మేయర్,అధికారుల ఆకస్మిక పర్యటనలు లేకపోవడంతో పారిశుధ్య నిర్వహణ గాడితప్పుతున్నది. కేటీఆర్ మండిపడ్డాడు. పర్యవేక్షించాల్సిన పార్ట్-టైం మున్సిపల్ మంత్రేమో ఎమ్మెల్యేల కొనుగోళ్లు, ఢిల్లీ చక్కర్లలో బిజీగా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. పౌరుల ఆరోగ్యాలు కాపాడాలని కేటీఆర్ పేర్కొన్నారు.